Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాడు అకర్ష్ ... నేడు వికర్ష్
posted on: Jul 9, 2022 1:17PM
వస్తున్నారుగదా అని అందరినీ మద్దతుదారులుగా భావించి రానిస్తే ఆ వచ్చినవారితో వచ్చే సమస్యలూ భరించాల్సి వస్తుంది. ఇపుడు తెలంగాణాలో టిఆర్ ఎస్ పరిస్థితి ఇదే. ఆపరేషన్ ఆకర్ష్ అనే పెద్ద పేరు పెట్టి రాష్ట్రంలో విపక్షాలకు అవకాశం లేకుండా యువతను ముఖ్యంగా ఓటర్లను అమాంతం పార్టీ సభ్య త్వం ఇచ్చేసి ఏదో చేయాలని భావించారు. ఇతర పార్టీల నుంచి కూడా నాయకుల్ని ఆకట్టుకోవడం టిఆర్ ఎస్ కి ఎంతో మేలు చేస్తుందనే భావించారు. కానీ సంఖ్య పెరగడం తలభారానికి దారితీస్తుందని వూహిం చలేదు. నాడు ఆకర్ష్ నేడు వికర్ష్ గా రూపు మారింది.
తెలంగాణాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాల్లో చిత్రమైన సమస్య తలెత్తిం ది. అక్కడ పార్టీ కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేయగల నాయకుల సంఖ్య ఎక్కువయింది. ఇదే కాదు మరో 20 నియోజకవర్గాల్లో ఇతర సమస్యలు తలెత్తాయి. కేసీఆర్ దూకుడును ఇష్టపడి చేరినవారంతా ఇపుడు వారి తప్పిదాలు తెలుసుకుని తిరిగి పాత గూటికి చేరుతున్నారు. అయితే ఇప్పటివరకూ వున్నం దువల్ల ఎలాంటి ప్రయోజనం కలగకపోగా, భవిష్యత్తులోనూ ఏమీ వుండదన్న జ్ఞానంతో వారి నియోజక వర్గాల్లో లొల్లి పెట్టుకుని మరీ టిఆర్ ఎస్ ప్రతిష్టను దెబ్బతీసి బయటపడుతున్నారు. ఇది కేసీఆర్‌ను మరింత వేధిస్తోందనాలి.
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ వల్ల గొప్పప్రయోజనం వుంటుందని ఆశిం చారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ కార్యక్రమం పట్ల ఇతర పార్టీల నాయకులు కూడా మరింత ఆకర్షింప బడ్డారు. టిఆర్ ఎస్‌కి ఇక ఎదురులేదన్న భావన, పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వీరాభిమానంతో చేరికలు ఎక్కువయ్యాయి. అంతా వచ్చి చేరుతుంటే కేసీఆర్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. కానీ త్వరలోనే ఆకర్ష్ ఎంత భారంగా మారిందన్నది తెలిసింది. వచ్చినవారు, అప్పటికే పార్టీతో వున్న నాయకులు అందరూ పెద్ద తలకాయలే కావడంతో అనేక ప్రాంతాల్లో నాయకు లతో ఇబ్బంది ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో సీటు దొరుకుతుందన్న ఆశతో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ ఎస్ వేపు మళ్లే యత్నంలో వున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పిజిఆర్ కుమార్తె విజయారెడ్డి, నల్లాల ఓదెలు(చెన్నూరు). భిక్షమయ్య(ఆలేరు), తాటి వెంకటేశ్వర్లు(అశ్వరావుపేట) మరి కొందరు పాతగూటికి వరుసపెట్టారు.
ఈ నేపథ్యంలో సిటింగ్ ఎమ్మల్యేలు, తమ నియోజకవర్గాల నుంచి సీట్లు ఆశించనివారూ కాంగ్రెస్ అధ్య క్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీలోకి చేరిపోతున్నారు. అయితే టిఆర్ ఎస్‌లో తలెత్తిన విభేదా లను గుర్తించి కేసీఆర్ అందర్నీ బుజ్జగించే పనిలో వున్నారని కాంగ్రెస్‌లోకి వచ్చేసినవారి మాట. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఎంఎల్‌సీ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మల్యే బేతి సుభాష్ రెడ్డి మొదలైనవారితో సమస్యలు తలెత్తాయి. అన్నింటికీ మించి హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో విభేదాలు తలెత్తడం గమనార్హం. చిత్రమే మంటే, వీరంతా టిఆర్ ఎస్ నాయకులే. ఇటీవలే మహేశ్వరం నియోజకవర్గం కూడా విభేదాలకు కేం ద్రం గా మారింది. ఇక్కడ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు మరింత బయటపడ్డాయి. దాదాపు ఇదే దారిలో హుస్నాబాద్, నక్రేకల్ నియోజకవర్గాలూ వున్నా యని తెలుస్తోంది.
మరో చిత్రమేమంటే ఖమ్మం జిల్లాలో ఏకంగా అధికారపార్టీ వారి మధ్యే విభేదాలు తలెత్తాయి. రేగ కాంతా రావు, పాయం వెంకటేశ్వర్లు(పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటే శ్వరరావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాళ ఉపేందర్ రెడ్డి, తిరుమల నాగేశ్వర రావు (పాలేరు) విభేదాల జాబితాలో వున్నారు. ఇలా ఇటీవలి కాలంలో విభేదాలతో దాదాపు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజ కవర్గాల్లోనూ టిఆర్ ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్‌పట్ల విముఖతతోనే వున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఆకర్ష్ కార్యక్రమం కాస్తా వికర్ష్ గా మారిపోయి కేసీఆర్‌కు తలభారంగా మారింది. మున్ముందు కాంగ్రెస్ జోస్యం ఫలించినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.
.......






