Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హెల్మెట్ మాకేనా..పోలీసులకు ఉండవా..?
posted on: Mar 20, 2021 3:16PM
ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరు సమానమే. అది పొలిటిషన్ అయినా, పోలీస్ అయినా , సామాన్యులైనా. చట్టానికి ఎవరు చుట్టాలు కారు. కొందరు అధికారులు తమకు చట్టాలు చుట్టాల భావిస్తుంటారు. అందుకే వాళ్ళు చేసే తప్పులు కనిపించవు. వాళ్ళు చేసింది తప్పని అడగడానికి దైర్యం చేయరు. కానీ ఖమ్మం లో ఒక్క యువకుడు పోలీసుల తీరును వ్యతిరేకించాడు. రూల్స్ మాకేనా మీకు ఉండవా అని ప్రశ్నించాడు ఆ యువకుడు.
హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులనే ప్రశ్నించాడు ఓ యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్మెట్ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పోలీసులు ద్విచక్రవాహనాలపై హెల్మెట్ ధరించకుండా వచ్చిన విషయాన్ని గమనించిన ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నించాడు. మీకు శిరస్త్రాణం పెట్టుకునే బాధ్యత లేదా అంటూ నిలదీశాడు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని, మీరే నిబంధనలు పాటించనప్పుడు మాకెలా జరిమానాలు విధిస్తారని ఆ యువకుడు మండిపడ్డాడు.


.jpg)



