Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శవ రాజకీయం.. బూమరాంగ్ అవుతున్న వైసీపీ ట్రేడ్ మార్క్ వ్యూహాలు?
posted on: Jul 17, 2026 2:55PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా శవరాజకీయం అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో మరణించినా వెంటనే రాజకీయ కోణంలో చిత్రీకరించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్న భావన జనబాహుల్యంలోనే వ్యక్తం అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే, రాష్ట్రంలో సంభవించే ప్రతి చావునూ వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు లేదా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగే నేరాలకు కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. చనిపోయిన వ్యక్తి తమ పార్టీకి చెందిన కార్యకర్త అని, అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని వైఎస్సార్సీపీ అగ్రనాయకత్వం నుంచి స్థానిక నేతల వరకు అంతా ఒకే రాగంతో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల ద్వారా కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేదే వైసీపీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
అయితే.. ఈ తరహా ప్రచారాలు చాలా సందర్భాల్లో వైసీపీకి బూమరాంగ్ అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఏదైనా ఒక ఘటన జరిగిన వెంటనే దానికి రాజకీయ రంగు పూసినప్పటికీ, ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. నిందితులు, బాధితుల మధ్య ఉన్న పాత పగలు, వ్యక్తిగత వివాదాలే ఆయా నేరాలకు కారణమని ఆధారాలతో సహా తేలిపోతోంది. కొన్ని సందర్భాల్లో స్వయంగా బాధితుల కుటుంబ సభ్యులే మీడియా ముందుకు వచ్చి, తమకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని, ఇది పూర్తిగా వ్యక్తిగత గొడవ అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రాథమిక సమాచారాన్ని సరిచూసుకోకుండానే శవాల వద్దకు వెళ్లి ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం వల్ల వైఎస్సార్సీపీ తీవ్రంగా ఆభాసుపాలవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక డిజిటల్ యుగంలో సమాచారం వేగంగా ప్రజలకు అందుతోంది. ఒకప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక విషయాన్ని ప్రచారం చేస్తే, అదే నిజమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా, స్థానిక సమాచార వ్యవస్థల వల్ల ప్రతి ఒక్కరికీ క్షణాల్లో అసలు విషయాలు తెలిసిపోతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశంలో వాస్తవంగా ఏం జరిగిందనేది స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీంతో వైసీపీయుల ఆరోపణల్లో నిజానిజాలు ఎలాంటి జాప్యం లేకుండా జనబాహుల్యంలోకి వేగంగా చేరిపోతున్నాయి. దీంతో నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం శవ రాజకీయాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ వేస్తున్న అడుగులు అపహాస్యం పాలౌతున్నాయి.
2019 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని కీలక పరిణామాలు, మరణాలు, దాడుల ఉదంతాలను వైసీపీ అప్పట్లో తమకు అనుకూలంగా సానుభూతి కలిగేలా మరల్చుకోగలిగింది. కోడి కత్తి, వైఎస్ వివేకా హత్య వంటి సంఘటనలు అప్పట్లో వైసీపీకిగా అనుకూలంగా మారియి. ఆ తరువాత అసలు విషయాలు జనంలోకి వెళ్లాయనుకోండి అది వేరే సంగతి. ఇప్పుడు కూడా వైసీపీ అదే ఫార్ములానుఅమలు చేయాలని చూస్తోంది కానీ ఫలితం మాత్రం ఉండటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
AP politics, YS Jagan, TDP Alliance government, Law and order, Andhra Pradesh





