TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!

Published on: Wed Feb 11, 2026 9:25AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభం కావడంతోనే వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు.

 ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలి, ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు.  వైసీపీ సభ్యుల నినాదాల మధ్యనే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్ది సేపు నినాదాలు చేసిన వైసీసీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి సభనుంచి వాకౌట్ చేశారు.