కేసీఆర్ ను పిలిచినట్టు జగన్ ను పిలవొచ్చుగా.. ఉమ్మారెడ్డి
Published on: Sat Oct 17, 2015 4:07PM

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలికే నేపథ్యంలో కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే చంద్రబాబు సీఎంవో ఆఫీసు నుండి ఆధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంఓ ఆఫీసుకు ఫోన్ చేసి మరీ అపాంయింట్ మెంట్ అడిగారు. అయితే దీనిపై వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిని ఇంటికి వెళ్లి పిలిచినట్టు.. చంద్రబాబు జగన్ ను కూడా స్వయంగా వెళ్లి పిలవచ్చు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ ను అపాంయింట్ మెంట్ కోరినట్టు జగన్ కు కూడా కోరవచ్చు కదా అని అన్నారు. తన ఆరోగ్యం సరిగా లేకనే మంత్రులను కలవలేకపోయారని అని తెలిపారు. ఒకవేళ శంకుస్థాపనకు కనుక వెళితే మోదీ పక్కన కూర్చోబెడతారా.. తమ ప్రాధాన్యాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న మోడీ తమకు మాట్లాడే అవకాశం అవకాశం ఇవ్వాలని కోరారు.


