TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుపై వైసీపీ రోజా విసుర్లు

Published on: Mon Sep 21, 2015 12:43PM

ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు... కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పట్టించుకోకపోయినా, స్పెషల్ స్టేటస్ వచ్చేవరకూ వైసీపీ పోరాడుతుందని ఆమె అన్నారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారారెడ్డి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా, ప్యాకేజీ వేర్వేరు అంశాలని, ఈ రెండింటి కోసమూ తాము కడవరకూ పోరాడతామన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ ప్రజలను మోసం చేశాయని, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ పార్టీలకు జనం బుద్ధిచెబుతారని వైవీ వ్యాఖ్యానించారు.