Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జబర్దస్త్ హైపర్ ఆది కారు ధ్వంసం
posted on: Jan 21, 2019 9:31AM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కందూరులో జరిగిన జనసేన సభ రసాభాసగా మారింది. కొందరు స్థానిక నేతలు ప్రసంగిస్తూ వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేశారు. దీనికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ‘జై జగన్’ అంటూ నినదించారు. అదే సమయంలో సభ వద్దకు హైపర్ ఆది రావడంతో ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు వారిని అడ్డుకొని ఆదిని వేదికపైకి తీసుకెళ్లారు. వైసీపీ శ్రేణుల నినాదాల మధ్యే హైపర్ ఆది ప్రసంగం మొదలుపెట్టారు. జనసేన గుర్తు గాజు గ్లాసు అని అది కిందపడితే పగిలపోద్ది కానీ ఎదురు తిరిగితే దిమ్మ తిరిగిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. జనసైన్యం దాడులకు భయపడదని దెబ్బదెబ్బకి రాటు దేలుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితోపొత్తులు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఆయనను ఎవరూ ఓడించలేదరన్నారు. యుద్ధంలో దెబ్బ పడేకొద్ది బలహీన పడటానికి ఇది రాజుల సైన్యం కాదని జనసైన్యం అంటూ ప్రసంగించారు. రాబోయే నాలుగు నెలల్లో ఇలాంటి దాడులు ఉంటాయని అయినా వెనకడుగు వెయ్యబోమన్నారు.
రాజకీయాలు గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలంటున్న వ్యాఖ్యలను హైపర్ ఆది ఖండించారు. అనుభవం అవసరమే కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే సరిపోతుందని అనుభవం అవసరం లేదన్నారు. గతం గురించి తెలుసుకోవడంలో తప్పులేదన్నారు. కార్యకర్తలు మంచోళ్లేనని అయితే నాయకులు మంచోళ్లో కాదో చూసుకోవాలన్నారు. కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కులపిచ్చితో కొందరు ఓట్లు వేస్తున్నారని, కానీ పవన్‌లాంటి నిస్వార్థ నేతను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్‌కు డబ్బు, పదవి పిచ్చిలేదని, కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. హైపర్ ఆది వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఆది ప్రసంగానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుతగులుతూ ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ వేదిక వరకూ వచ్చారు. దీంతో ఆది తన ప్రసంగాన్ని ముగించేశారు. ఆది, మరికొందరు జనసేన నేతలను మరో మార్గం నుంచి పోలీసులు తిరుపతికి పంపారు.






