Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అఖిలప్రియ బాడీగార్డ్ మీద హత్యాయత్నం
posted on: May 15, 2024 11:46AM
ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు వైసీపీ గూండాలు ఎంతమందిని చంపాలని టార్గెట్‌గా పెట్టుకున్నారోగానీ, వరసబెట్టి హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిలో పులివర్తి నానిని చంపడానికి 150 మంది గొడ్డళ్ళతో దాడి చేసిన ఘటన ఏపీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. జనం ఇంకా ఈ భయంలో వుండగానే వైసీపీ గూండాలు మరో హత్యాయత్నం చేశారు. ఆళ్ళగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ మీద హత్యాయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చేశారు. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిల్చుని వుండగా, కారులో వేగంగా వచ్చిన దుండగులు ఆయన్ని ఢీకొట్టారు. వెంటనే మారణాయుధాలతో నిఖిల్ మీద దాడి చేశారు. తీవ్రంగా గాయపడినప్పటికీ నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ని నంద్యాల ఆస్పత్రికి తరలించారు.


.webp)
.webp)


