TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ నేతల హడావుడి.. సీసీ కెమేరాల్లో రికార్డు..

Published on: Thu Dec 17, 2015 12:00PM

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఎయిర్ ఇండియా మేనేజర్ పై మిధున్ రెడ్డి చేయి చేసుకొని ఎయిర్ పోర్ట్ లో నానా హడావుడి చేశారు. ఈ విషయంలో వీరిద్దరిపై విమర్శలు తలెత్తాయి. కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఇద్దరూ ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. మొదట చెవిరెడ్డి కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించినా తరువాత.. తానే లొంగిపోయాడు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ ఈ వివాదంలో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఉద్యోగి మీద చేయి చేసుకోవటంతో పాటు.. పార్టీ కార్యకర్తల హడావుడి ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమేరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వీరిద్దరికి చిక్కులు తప్పవని అందరూ అనుకుంటున్నారు.