Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ నేతలు.. ఉద్రిక్తత!
posted on: Jul 7, 2019 2:07PM

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురంలో.. ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను స్థానిక వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలాసపురంలోని అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ప్రారంభోత్సవం చేయడానికి వీలులేదని పట్టుబట్టారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అశోక్ వైసీపీ నేతలపై సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాక స్టేషన్ ముందు నిరసనకు దిగారు.






