జగన్ మాటల్లో ఆంతర్యం ఏంటో.. ఇంకా ఎమ్మెల్యేలు వెళ్లినా పర్వాలేదు..!
posted on Apr 23, 2016 1:17PM

ఒకపక్క వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి వైకాపాలోకి వెళుతుంటే.. ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుండటంతోపాటు.. పార్టీ నేతల్లో గందరగోళం నెలకొన్న పిరస్థితి ఏర్పడింది. వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు జంప్ అవుతున్న నేపథ్యంలో.. పార్టీ ఫిరాయింపులపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయడానికి ఈరోజు జగన్ ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ ఇంకో ముగ్గురు, నలుగరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లినా పర్వాలేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు.. తెదేపాలోకి వెళ్లాలనుకునేవారు ఇంకా వైకాపాలో ఉన్నారనే సంకేతాలు జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయ. మరి జగన్ మాటల్లోని ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలి.