Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెండు ఒకట్లు ఒకటవుతుంది.. ఇంకా మాట్లాడితే సున్నా అవుతుంది!
posted on: Mar 7, 2025 8:22AM
.webp)
అయితే కావచ్చును. ఆయన మహా నేత కడుపున పుట్టిన, ఓ మహా నే(మే)త అయితే కావచ్చును.అలాగని ఆయన అనుకోవచ్చును.ఇక్కడ విషయం ఏమంటే, ఆయనగారి ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనకు శిక్షగానా, అన్నట్లుగా ప్రజలు, ఎన్నికల్లో ఆయన్ని, ఆయన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు.గట్టిగా బుద్ధి చెప్పారు. కొద్దిగా గడ్డి కూడా పెట్టారు.
అవును మనం ఇప్పడు మాట్లాడుకుంటోంది, ఆంధ్ర ప్రదేశ్ మాజీ, ముఖ్యమంత్రి, వైసీపీ శాశ్వత అధ్యక్షుడు శ్రీమాన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే, సరే ఇచ్చి చూద్దాం అని, ప్రజలు 2019లో ఒక్క ఆవకాశం ఇచ్చారు. అలా ఒక్క సారి, అధికారం ఇచ్చిన ప్రజలే, 2024 ఎన్నికల్లో, ఇక చాలు ఛీ పో ..అంటూ జగన్మోహన్ రెడ్డిని ఛీ కొట్టి పంపించారు. వైసీపీని ఓడించారు. ఏదో అనుకుని, ఏదో ఆశించి ఓటేసి గెలిపిస్తే, జగన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనతో వందేళ్ళకు సరిపడా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఈ ముదనష్టపు పీడ ఎప్పడు వదిలి పోతుందా? అని ప్రజలు ఎదురు చూసేలా దుర్మార్గ, దుష్ట పాలనా సాగించారు. అందుకే ప్రజలు, ఓటు అస్త్రంతో రాక్షస సంహారం గావించారు. 2024 ఎన్నికల్లో కసితీరా ఓడించారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి మెడ పట్టి గెంటారు.
అధికార పీఠం నుంచి గెంటేస్తే గెంటేశారు,పోనీ ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అందుకు పనికిరావని, పదకొండు సీట్లకు పరిమితం చేశారు. నిజానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవ స్థలో గెలుపు ఓటము సహజం. ఆలాగే ఓడలు బళ్లవడం, బళ్ళు ఓడలు అవడం మామూలు విషయమే. ప్రజాస్వామ్యం పట్ల ఏ కొంచెం నమ్మకం, విశ్వాసం ఉన్న ఎవరైనా, చివరకు అత్యంత చౌకబారు రాజకీ య నాయకుడు అయినా, ఓటమిని అంగీకరించి, గౌరవిస్తారు. ఎంతో కొంత హుందాగా వ్యహరిస్తారు. ప్రజలు అవకాశం ఇచ్చిన మేరకు, ప్రజాసేవ చేసి తద్వారా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తారు.
కానీ, జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. ఆ విషయం అర్థ మయ్యేందుకు అంతగా కష్టపడవలసిన అవసరం లేదు. జగన్ ఐదేళ్ళ పాలనే అందుకు ప్రత్యక్ష సాక్షిగా నిలచింది.ఆయన పాలనే, అందుకు సజీవ సాక్ష్యం. ఇక హుందాతనం అనేది, ఆయన నిఘంటువులో లేని పదం. కన్న తల్లి, రక్తం పంచుకు పుట్టిన సోదరి పై ఆయన ప్రవర్తించిన తీరే, అందుకు సాక్ష్యం. సో సహజంగానే, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించడం, అయన సహజ నైజానికి విరుద్ధం. అందుకే, ప్రతిపక్ష హోదా కోసం వికృత విన్యాసాలు చేస్తున్నారు.
అందుకే ప్రజలు ఇంతగా ఛీ కొట్టినా, చీదరించుకున్నా, తగుదునమ్మా’ అంటూ సిగ్గు విడిచి చిందు లేస్తున్నారు.ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం చిత్ర విచిత్ర వికృత విన్యాసాలు చేస్తున్నారు. ఛీ..పో అని ఛీ కొట్టినా చూరుపట్టుకుని వెళ్ళాడుతున్నారు. నవ్వుల పాలవుతున్నారు. నిజానికి,. వై నాట్ 175 అంటూ, మితిమీరిన అహంకారంతో విర్ర వీగిన, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పు మింగుడు పడడం కొంచెం చాలా కష్టమే, కాదన లేము.
కానీ, ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి, వైసీపీ నయకులు పాకులాడుతున్న తీరు,పార్టీకే తలవంపులు తెస్తోందని, వైసీపీ నాయకులే వాపోతున్నారు. పదవులు అడుక్కోవం ఏమిటని విస్తుపోతున్నారు. నిజమే కావచ్చును, జనసేన కంటే వైసీపీకి ఎక్కు శాతం ఓట్లు వచ్చిన మాట నిజమే కావచ్చును, కానీ, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి ఒక రికార్డును సృష్టించింది. మరోవంక వైసీపీ, వై నాట్ 175 అంటూ విర్రవీ 11 స్థానాలకు పడిపోయి పరువు పోగుట్టుకుంది. అంతే కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, జగన్ అండ్ కో ఎంతగా దిగజారినా, ఎంతగా విలపించినా,వేడుకున్నా ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేత అధికార పీఠం దక్కదు. రాదు అంటే, ఎవరో అడ్డు కుంటారని కాదు. రాజ్యాంగం ప్రకారం మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే ప్రతిపక్షహోదా పొందేందుకు, వైసీపీకి ఉన్న రెండు ఒకట్లు ,అదే 11 సంఖ్యా బలం సరిపోదు. అందుకే, ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ పస్తుత సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని సోదాహరణగా వివరించారు. అయితే ఉన్నమాటంటే, ఉలుకెక్కువ అన్నట్లు జగన్ రెడ్డి మీడియా ముందు, ప్రతిపక్ష హోదా కోసం విలాపనలతో నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్’ కార్పోరేటర్’కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వికారపు వ్యాఖ్యలు చేశారు. అలాగే, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గంటూ గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా తానే ఇచ్చినట్లు చెప్పుకున్నారు.
ఇది చాలదన్నట్లు ఇప్పుడు గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చి చూపుతూ ఆ పార్టీ మేధావులు? వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2024 ఎన్నికలలో కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన జనసేన పార్టీ అధినేతకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నప్పుడు.. 40 శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే, ప్రతిపక్ష హోదాకు ఉండవలసిన అర్హతలు ఏమిటో కూడా, ఈ మేతావులకు ... మహా మేతకు తెలియదని అనుకోవాలేమో.
ఇలా ఒకదాని వెంట ఒకటిగా విచిత్ర వాదనలను, ఇల్లాజికల్ లాజిక్’ ను తెర పైకి తెస్తున్న జగన్ రెడ్డి, ఆయన బఫూన్ బ్యాచ్ పార్టీ పరువును మరింత పలచన చేసుకుంటున్నారని, అంటున్నారు. అలాగే, జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పును సరిగా అర్థంకుని , హుందాగా వ్యవహరిస్తే అది ఉభయ తారకం. అది అందరికీ మంచింది.. కాదంటే పదకొండు ఒకటవుతుంది.. ఇంకా మాట్ఒలాడితే సున్నా కు చేరుతుంది.



.webp)


