TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యడ్యూరప్ప ఇంట్లో విషాదం

Published on: Fri Jan 28, 2022 3:17PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప ఇంట్లో విషాదం నెలకొంది. యెడ్డీ మనవరాలైన 30 ఏళ్ల సౌందర్య తన స్వగృహంలోనే ఉరేసుకుని చనిపోయింది.  బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టరుగా పనిచేస్తున్న సౌందర్యకు 4 నెలల పాప కూడా ఉంది. ఆమె భర్త కూడా డాక్టరే. అయితే ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చిన సౌందర్య పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ కు లోనై.. ఒత్తిడి భరించలేక చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని సిటీలోని బౌరింగ్ హాస్పిటల్ కు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చాక ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. 

సౌందర్య... యడ్యూరప్ప మొదటి కూతురు కూతురు. ఈ వార్త తెలిసినవెంటనే మంత్రులు, పలువురు బీజేపీ నేతలు హాస్పిటల్ కు చేరుకొని పరిస్థితిని ఆరా తీస్తున్నారు.