TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Published on: Sun Jun 1, 2025 12:19PM

 

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కారు పార్కింగ్‌, బస్టాండ్‌ ప్రదేశాల్లో సందడి నెలకొంది.

ఆలయ పరిసరాల్లో ఈవో వెంకట్రావు తిరుగుతూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో ఆలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు.