Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు కన్నుమూత
posted on: Jul 22, 2013 10:51AM

ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు (82) కన్నుమూశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో ఆయన మరణించారు. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ఘాట్‌లోని శ్మశానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. బాలసాహిత్యంలో ఎంతో కృషి చేసిన సుప్రసిద్ద రచయిత గా ఆయన ప్రసిద్దిగాంచారు. కంద పద్యశతకాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటికలు అనేకం ఆయన లిఖించారు. రాజేశ్వరరావుకు కుమార్తె స్నేహలత, కుమారుడు రామదాసు ఉన్నారు. రామదాసు ఢిల్లీలోనే రక్షణ శాఖలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తుండగా.. కూతురు స్నేహలత గాయనిగా, వైణికురాలిగా పేరొందారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జానకి, మోహన రాజు తదితరులు ఆయన రచించిన పాటలను పాడారు.


.jpg)



