Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుమతి లేకుండా దేశం దాటను.. అనిల్ అంబానీ
posted on: Feb 20, 2026 8:27AM
.webp)
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లనని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రూ.40 వేల కోట్ల మోసం కేసుల్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్న నేపధ్యంలో అనిల్ అంబానీ విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉన్నాయని, బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసుల్లో సత్వర, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ మాజీ అధికారి ఈఏఎస్ శర్మ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన పిల్ పై అనిల్ అంబాని గురువారం (ఫిబ్రవరి 19) దాఖలు చేసిన అఫిడవిట్ లో ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసుల్లో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ఈ కేసుల్లో దర్యాప్తు మొదలైనప్పటి నుంచి తాను దేశం విడిచి వెళ్లలేదని, ఇప్పటికైతే విదేశాలకు వెళ్లే ఉద్దేశం, లేదనీ ఆ అఫిడవిట్ లో అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తే కోర్టు నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకుంటానని తెలిపారు . అక్రమ నగదు బదిలీ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిందని, తాను ఆ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.


.webp)



