Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...న్యూజిలాండ్‌కి షాక్.. కెప్టెన్ డక్కౌట్
posted on: Mar 29, 2015 9:21AM

వన్డే వరల్డ్ కప్ 2015 ఫైనల్లో ఆతిథ్య జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్‌గా రంగంలోకి దిగిన కెప్టెన్ మెక్కల్లమ్ డక్ ఔట్ కావడం విశేషం. మొదటి ఓవర్లోని నాలుగో బంతికి ఆస్ట్రేలియాన్ బౌలర్ స్టార్క్ వేసిన బంతికి మెక్కల్లమ్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఈ టోర్నమెంట్‌లో బాగా రాణించిన మెక్కల్లమ్ ఫైనల్లో ఇరగదీస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అనుకోకుండా మెక్కల్లమ్ డక్కవుట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన వెంటనే మెక్కల్లమ్ చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా తమకు లభిస్తున్న మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. ఇదో గొప్ప ఫైనల్ మ్యాచ్ అవుతుందని పేర్కొన్నాడు.






