Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టాస్ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్...
posted on: Mar 19, 2015 8:43AM

ప్రపంచకప్ క్రికెట్‌లో భాగంగా గురువారం జరగనున్న రెండో క్వార్టర్ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు నాకౌట్ పద్ధతి ప్రకారం తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ మ్యాచ్ మాత్రం ఇండియాకి ఫేవరెట్‌గానే వుంది. వరల్డ్ కప్‌లో పెద్దగా రాణించని బంగ్లాదేశ్ ఏదో టైమ్ బావుండి క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది. ఇంత వత్తిడిని ఎదుర్కొనే సత్తా ఆ చిన్న జట్టుకు లేదని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఊహించని విధంగా ఫామ్‌లోకి వచ్చిన భారత క్రికెట్ జట్టు ఈ మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచే అవకాశం వుందని చెబుతున్నారు. ఇదిలా వుండగా మెల్‌బోర్న్‌లో మబ్బులతో కూడిన వాతావరణం వుంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం వుందని తెలుస్తోంది.



.jpg)


