Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుస్తకమే పరిణితి చెందిన వ్యక్తిత్వానికి మూలం..
posted on: Apr 23, 2025 9:30AM
.webp)
పిల్లలకు ఒక వయసు రాగానే పుస్తకాలతో సావాసం మొదలవుతుంది. చాలా వరకు పిల్లల జీవితంలో పుస్తకాలు అంటే అవి పాఠ్యపుస్తకాలే ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎంత ఎక్కువ తరగతి పుస్తకాలు చదువుతూ ఉంటే తల్లిదండ్రులకు అంత తృప్తి. వారు చదువులో బాగా రాణిస్తారని తల్లిదండ్రుల ఆశ. అయితే పిల్లల జీవితం చదువులోనే కాకుండా విలువలు, వ్యక్తిత్వం, మంచి అలవాట్లు, గొప్ప గుణాలు వంటివి మాత్రం పుస్తక పఠనం ద్వారానే సాధ్యమవుతుంది. పుస్తక పఠనం అంటే పాఠ్య పుస్తకాలు చదవడం కాదు. పిల్లలలో ఆలోచనలు కలిగించే, స్పూర్తిని కలిగించే, ప్రేరణ కలిగించే విషయాలు కలిగిన పుస్తకాలు చదవడం. గొప్ప వ్యక్తుల చరిత్రలు కావచ్చు, నీతి కథలు కావచ్చు, సామాజిక విషయాలకు సంబంధించినవి కావచ్చు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం గురించి, ఈ పుస్తక దినోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే..
ఏప్రిల్ 23న విలియం షేక్స్పియర్, మిగ్యుల్ డి సెర్వంటెస్ వంటి గొప్ప సాహిత్యవేత్తలు మరణించారు. ఈ సాహిత్యవేత్తలకు నివాళిగా ఈ తేదీని ప్రపంచవ్యాప్తంగా పుస్తక దినోత్సవంగా జరుపుకుంటారు. పుస్తకాలను చదవడం, ప్రచురించడం, మేధో సంపత్తి రక్షణను ప్రోత్సహించడానికి యునెస్కో దీనిని వార్షిక వేడుకగా ప్రకటించింది.
థీమ్..
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది పుస్తక దినోత్సవం సందర్భంగా థీమ్ ఏర్పాటయింది. "మీ మార్గాన్ని చదవండి: ప్రతి మనసుకు విభిన్న పుస్తకాలు" అనే థీమ్ ఈ ఏడాది ప్రవేశపెట్టారు. ఈ థీమ్ చదవడాన్ని మొదలుపెట్టడాన్ని, చదవడంలో వైవిధ్య ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది పాఠకులను సాహిత్యం ద్వారా విభిన్న విషయాలు, దృక్పథాలు, సంస్కృతులను అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది, సహానుభూతి, ప్రపంచ అవగాహనను ప్రోత్సహిస్తుంది.
చరిత్ర..
ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని UNESCO 1995లో స్థాపించింది. ఈ ఆలోచన స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ నుండి వచ్చింది. ఆయన రచయిత మిగ్యుల్ డి సెర్వంటెస్‌ను సత్కరించాలని కోరుకున్నారు. 1995 నుండి ప్రపంచ పుస్తక దినోత్సవం పాఠశాలలు, గ్రంథాలయాలు, రచయితలు, ప్రచురణకర్తలు పాల్గొనే ఒక ప్రధాన ప్రపంచ కార్యక్రమంగా పరిణామం చెందింది. ఇది చదవడంలో ఆనందాన్ని వ్యాప్తి చేస్తుంది. UK, ఐర్లాండ్ వంటి కొన్ని దేశాలలో, దీనిని మార్చిలో జరుపుకుంటారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23 న జరుపుకుంటారు.
పుస్తకాలు చదివితే..
అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది..
పిల్లలు, పెద్దలు పుస్తకాలు చదివితే అక్షరాస్యత స్థాయిలను పెంచేలా ప్రోత్సహిస్తుంది.
ప్రచురణకు మద్దతు ఇస్తుంది..
ప్రపంచవ్యాప్తంగా రచయితలు, చిత్రకారులు, ప్రచురణకర్తలు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. వారిని ప్రోత్సహిస్తుంది.
ఊహాశక్తిని పెంపొందిస్తుంది..
చదవడం సృజనాత్మకత, పదజాలం, విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది.
సంస్కృతులకు వారధిగా నిలుస్తాయి..
పుస్తకాలు విభిన్న నేపథ్యాలు, అనుభవాల నుండి వచ్చిన వ్యక్తులను కలుపుతాయి.
మార్పును ప్రేరేపిస్తుంది..
సాహిత్యం వ్యక్తిగత, సామాజిక పరివర్తనను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది.
*రూపశ్రీ.


.webp)



