Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆస్తమా సమస్య వేధిస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
posted on: May 2, 2023 2:28PM
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆరోగ్యం విషయంలో చాలామంది చాలా దారుణమైన నిర్లక్ష్యం చూపిస్తారు. అందరూ గ్రామాల్లో నివసించేవారికి తగిన వైద్య సదుపాయం ఉండదని ఎద్దేవా చేస్తుంటారు కానీ పట్టణాల్లో నివసించేవారికి చాలా తొందరగా అనారోగ్యాలు వచ్చేస్తాయి. నిత్యం వాహనాల రాకపోకలతో జరిగే వాయుకాలుష్యం కారణంగా అన్ని పట్టణ ప్రాంత ప్రజలలోనూ ఎక్కువ శాతం ఎదుర్కొంటున్న సమస్య ఉబ్బసం. దీన్నే ఆస్తమా అని అంటారు.
ఊపిరితిత్తులు, శ్వాసకు సంబంధించిన ఏదైనా సమస్యలు చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులలో ప్రత్యేక నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శ్వాస సంబంధిత సమస్యలను తేలికగా తీసుకోవడం మంచిది కాదు. కేవలం ఈ ఒక్క సమస్య ఎన్నో విధాలుగా హాని కలిగిస్తుంది. సహజంగానే శ్వాసనాళాలు చిన్నగా ఉంటాయి. వీటికి ఏమాత్రం అసౌకర్యం కలిగినఆ అవి ఉబ్బుతాయి. ముఖ్యంగా ఆస్తమా విషయంలో అదనపు శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఈ పరిస్థితులు సాధారణ శ్వాస ప్రక్రియలో జోక్యం చేసుకుని ఇబ్బంది పెడతాయి. . కొంతమందికి, ఉబ్బసం సమస్య తీవ్రంగా ఉంటుంది, దీని కారణంగా కొన్నిసార్లు రోజువారీ పనులను నిర్వహించడం కూడా కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా నివారణకు, నియంత్రణ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఆస్తమా సమస్యలు ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణలు, దాని గురించి అవగాహన చాలా ముఖ్యం. ఈ కింది విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలు..
ఆస్తమాను ప్రోత్సహించే పనులకు దూరంగా ఉండాలి..
రోజూ చేసే కొన్ని పనులు ఆస్తమా సమస్యను మరింత పెంచుతాయి. అలెర్జీని ప్రేరేపించే వాటికి గురికావడం వలన దాని లక్షణాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆస్తమాను పెంచే వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. దుమ్ము, ధూళి, బాక్టీరియా, పురుగులు, పెంపుడు జంతువుల నుండి రాలిపడే వెంట్రుకలు.. మొదలైనవి గాలిలో కలిసిపోయి ఉంటాయి. ఇలాంటి గాలి పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కాబట్టి గాలి కాలుష్యానికి దూరంగా ఉండాలి. శారీరక శ్రమ పట్ల శ్రద్ధ వహించాలి. చల్లని గాలికి దూరంగా ఉండాలి.
నివారణ గురించి జాగ్రత్తగా ఉండాలి..
ఆస్తమాను నివారించడం చాలా అవసరం. దీన్ని నిరవారించడానికి ఆస్తమాను ప్రేరేపించే కరకాలకు దూరంగా ఉండటంతో పాటు.. యోగా-వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఏదైనా అసౌకర్యాన్ని అనుభవిస్తే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
శ్వాసను పర్యవేక్షించాలి..
ఆస్తమా సమస్య ఉన్నట్లయితే, శ్వాస తీరుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తేలికపాటి దగ్గు, శ్వాసలోపం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. పీక్ ఎయిర్‌ఫ్లో మీటర్‌ని ఉపయోగించి శ్వాసక్రియ రేటును క్రమం తప్పకుండా కొలవాలి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే వాటిని తినాలి. తద్వారా శ్వాసకోశ సమస్యలు నియంత్రించవచ్చు.
మందులు, ఇన్‌హేలర్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి..
ఆస్తమా విషయంలో సొంత వైద్యం పనికిరాదు. సొంతంగా మందులు తీసుకోకూడదు. లేదా వైద్యులు రాసిన మందులు మార్పులు చేసుకోకూడదు. వైద్యులు సూచించిన మనదులను సరైన మోతాదులో క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ఇన్‌హేలర్‌ను ఎల్లప్పుడూ మీతో ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడానికి ఇవి సహాయపడతాయి.
ఇవన్నీ పాటిస్తే ఆస్తమా నుండి చాలా వరకు ఉపశమనంగానే ఉంటుంది.
◆నిశ్శబ్ద.






