Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పచ్చి బాలింత..పది కిలోమీటర్లు నడక.. రోడ్లు లేక నడకయాతన!
posted on: May 1, 2022 8:54AM
బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే సర్కార్.. పచ్చి బాలింత ఇంటికి వెళ్లడానికి నడక తప్ప మరో మార్గం లేని రోడ్ల పరిస్థితి గురించి ఏం చెబుతుంది. రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, నీరు సమృద్ధిగా ఉందంటూ నిన్నగాక మొన్ననే భుజాలు తడుముకున్న మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పచ్చి బాలింతను నడకయాతన పెట్టిన రహదారుల గురించి ఏం మాట్లాడుతారు? అసీఫాబాద్ జిల్లా గోవెననాయకపుగూడలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన నాగమ్మ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. పెద్దాపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి రావడంతో ఐదు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంది. ఆ తరువాత డిశ్చార్జ్ చేసి ప్రత్యేక వాహనంలో నిర్మల్ నుంచి ఆసీఫాబాద్ వరకూ వచ్చిన ఆమె అక్కడ నుంచి తన ఇంటికి పది కిలోమీటర్ల దూరం.
మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏడాది కిందట వేసిన రోడ్డు వర్షాలకు కోతకు గురైంది. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు చాలా కష్టం. దీంతో ఆ పచ్చి బాలింత పది కిలోమీటర్లూ నడిచే వెళ్లింది. రోజుల పసి గుడ్డును చేతుల్లో ఉంచుకుని మండు టెండలో పది కిలోమీటర్లు నడిచి నాగమ్మ ఇంటికి చేరుకుంది. ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. రోడ్లు కోతకు గురైనా పట్టించుకోని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా బాగుందని భుజాలు తట్టుకోవడం మాని వాస్తవంలోకి వచ్చి గ్రామాల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.






