TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాప్తాడు ఎమ్మెల్యేకు నిరసన సెగ.. ఖాళీ బిందెలతో మహిళల ఆగ్రహ జ్వాల

Published on: Wed May 18, 2022 1:38PM

‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’, ‘సర్పంచ్ డౌన్ డౌన్’ అని నినదిస్తూ రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ బిందెలతో మహిళలు చుట్టుముట్టారు. తాగు నీళ్ళు ఇవ్వాలంటూ మహిళల నుంచి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నిరసన సెగలు తగిలాయి. 2019లో తమకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గెలిచిన నెలలోగా నీళ్ళు అందిస్తామని చెప్పి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకూ పట్టనట్లు వ్యవహరించడమేంటని వారు ఫైరయ్యారు. మాట తప్పిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రోడ్లు, డ్రైనేజీ అంటూ మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డీ అవన్నీ ఎక్కడయ్యా అంటూ కక్కలప్లలి గ్రామస్తులు నిలదీశారు. దమ్ముంటే బయటకు రావాలంటూ ఎమ్మెల్యే తోపుదుర్తికి, సర్పంచ్ కి మహిళలు సవాల్ విసిరారు. ఇ

ళ్లు అమ్ముకున్నాం, స్థలాలు అమ్ముకున్నాం అని చెప్పి మాయచేసి సింపతీ ఓట్లు దండుకున్న తోపుదుర్తి తీరా తమ ఓట్లతో గెలిచిన తర్వాత సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తోపుదుర్తి అమ్ముకున్న ఇళ్లు, స్థలాలకు వాస్తు దోషాలే తప్ప మరో కారణం ఏమీ లేదని మహిళలు ఎద్దేవా చేశారు. అరకొరగా తమకు వచ్చే కూలి డబ్బులతో పూట గడపాలా..? నీళ్లే కొనుక్కోవాలా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.