మహిళలే బెస్ట్

 

 

women empowerment

 

 

నీకేం తెలుసు వంటవార్పు , పిల్లల పెంపకం తప్ప అని ఎవరైనా అంటే చిన్నబుచ్చుకోవలసిన అవసరం ఇంకేమాత్రం లేదు అవే మంచి మేనేజర్ కావడానికి ముఖ్యమైన అంశాలని పరిశోధించి మరీ నిగ్గుతేల్చారు - కనుక క్లార్క్ యూనివర్సిటి సెంటర్ ఫర్ క్రియేటివ్ లీడర్ షిప్ సంయుక్తం గా నిర్వహించిన పరిశోదన లో తెలిన ఆసక్తికర విషయం ఆడవారిని ఆనందంలో ముంచేసింది బిడ్డల్ని పెంచడంలోని నైపుణ్యం ఒక సంస్థనిర్వహణలో నైపుణ్యం ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయట కాబట్టి తల్లిగా బాధ్యత నిర్వహిస్తున్న గృహిణులు మంచి మేనేజర్ గా రాణించగల అవకాశాలు ఎక్కువని తేల్చారు .


   ఇంకా చురుకైన సాదారణ వ్యక్తికన్న  బహుముఖ సమస్యలతో బహుపాత్రాలని  పోషించే  వ్యక్తి విధి నిర్వహణ లో మెరుగ్గా వుంటారని  కూడా తేల్చారు  ఈ  పరిశోధనలో  ... ఎందుకంటే  వీరు అప్రమత్తంగా  వుంటూ ప్రతి పనిని సక్రమంగా పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారట  ...


     ఏతా వాత  తేలిందే  ఏమిటంటే ఇల్లాలు, పిల్లల తల్లి, ఇంటి భాద్యతలు  వంటివేవి  స్త్రీ పురోగతికి  అడ్డంకి ఏమాత్రం కావని  పైగా అవే ఆమెని చురుగ్గా, మెరుగైన పనిమంతురాలుగా తీర్చిదిద్దుతాయని.

                                                                                                                                               -----  రమ