TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య

Published on: Sun Aug 31, 2014 11:07AM

 

హైదరాబాద్‌లో నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. నగరం నడిబొడ్డులోని కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను గొంతు కోసి చంపేశారు. ఆదివారం తెల్లవారేసరికి బస్టాప్‌లో గొంతు కోసం వున్న మహిళను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హత్యకు గురైన మహిళ ఎవరనే విషయం కూడా ఇంకా తెలియరాలేదు.