వింక్ గ్లాసెస్

 

 

Wink Glasses Will Make You Blink, Wink Eyewear , The Wink Glasses

 

 

కళ్ళద్దాలు ఎందుకు ? మన కళ్ళు వాటి సామర్ద్యాన్నికోల్పోతుంటే వాటికి సహాయపడేందుకు ? అవునా? లేదా వాటి రక్షణకి , అందంగా కనిపించడానికి అంతే కదా ! కాదూ- అలసిన కళ్ళు రెప్పవేయటానికి అంతేకదా! కాదు అలసిన కళ్ళు రెప్పవేయటం కూడా మర్చిపోతే గుర్తుచేయటానికి ఆశ్యర్యంగా వుందా! గంటల కొద్ది సిస్టమ్ ల ముందు కూర్చుని పని ఒత్తిడితో కళ్ళకి రెప్పవేయడం కూడా మర్చిపోతున్నారట కొందరు, మరి అలా రెప్ప వాల్చకపోతే కళ్ళకి ఇబ్బంది కదా. అప్పుడు యూఎస్ బీ చార్జింగ్ కళ్ళజోడు పెట్టుకుంటే చాలు ఈ కళ్ళ జోడుకి వింక్ గ్లాసస్ అని పేరు పెట్టారు . ఇది మనం ఆదమరచి రెప్పవేయకుండా తెరను చూస్తూవుంటే ప్రత్యేక సెన్సార్ల సాయంతో కుడివైపు అద్దానికి మబ్బు కమ్మినట్టుగా చేస్తుంది. దీంతో మనం రెప్ప వాల్చక తప్పదు . ఇలా మనం పనిలో పది కళ్ళను ఇబ్బంది పెడితే ప్రతి ఐదు సెకన్లకు కళ్ళకు ఉపసమనం కలిగిస్తాయి ఈ వింక్ గ్లాసస్ దీన్ని ఛార్జ్ చేస్తుండాలి. ఇలా మనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటలు పాటు మన కళ్ళని కాపాడే పనిలో బిజీగా వుంటాయి ఆ కళ్ళద్దాలు పైగా ఈ కళ్ళద్దాలేం ప్రత్యేకంగా కనిపించవు మాములు మన కల్లద్దలనే వుంటాయి. ఎటొచ్చి ఓ పక్కగా ఓ చిన్న యంత్రం వుంటుంది. అంతే జపాన్ కు చెందిన మసునగా ఆప్టికల్స్ కంపనీ తయారుచేసిన ఈ కళ్ళద్దాలకి ఇప్పుడు బోల్డు డిమాండ్ చూశారా మన కనురెప్ప వేయటానికి కూడా ఇక మనం కష్టపడక్కర లెద్దు.


....రమ