Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లిక్కర్‌స్కామ్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించరా?
posted on: Aug 24, 2022 3:52PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు తేటతెల్లమయిందని బీజేపీ ఎంపీ జీవీ ఎల్ నరసింహారావు అన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికార వైపీసీ, టీఆర్ ఎస్ పార్టీలకూ సంబంధం ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకుండా ఉండడంపై జీవీఎల్ ప్రశ్నించారు.
బుధవారం(ఆగష్టు 24) విలేకరులతో మాట్లాడుతూ, లిక్కవర్ వ్యవహారంలో నిబంధనలు తుంగలో తొక్కా రని ఢిల్లీ చీఫ్ విజి లెన్స్ విభాగం నిర్ధారించిందని, ఢిల్లీ ప్రభుత్వం సమాధా నం చెప్పడం లేద ని జీవీఎల్ అన్నారు. ఎంతో విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కేవలం రూ. 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజిక్కించుకుందంటే ఎంత దారుణమని జీవీఎల్ అన్నారు. దీని గురించీ జగన్ సర్కార్ స్పం దించలే దని బీజేపీనేత అన్నారు. భూములను ఏ అవసరం కోసం ఇచ్చారని, ల్యాండ్ అగ్రి మెంట్‌పై జరిగిన అంశా లు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్ధలో డైరెక్టర్‌గా వున్నారని, వారి ఆసక్తి ఏమిటన్నది ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.
విశాఖలో పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆంధ్రేతర ప్రాంతానికి చెం దిన ఓటర్లను కావాలని 50 వేలు మందిని జాబితాలోంచి తొలగించారన్నారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖరాయడం జరిగిందని జీవీఎల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్రమంత్రి అమిత్ షా , సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ ఎంపీ జీవీల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరువురి భేటీలో రాజకీయ ప్రస్తావన లేకుండా వుండగలదా? అని అన్నారు. అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని వేరే పార్టీ వాళ్లు ఎలా అంటారని ప్రశ్నించారు. అది వారి భయాన్ని సూచిస్తుందోన్నారు. వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలన్నారు. తన వద్ద ఎలాంటి సమాచారం లేదని ఒక ప్రశ్నకు జీవీ ఎల్ సమాధానం గా చెప్పారు.






