రావ‌త్‌కు 17 శ‌త‌ఘ్నుల వంద‌నం ఎందుకంటే..?

posted on: Dec 10, 2021 5:16PM

భార‌త తొలి సీడీఎస్ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో 17 శ‌త‌ఘ్నుల‌తో సైనిక వంద‌నం స‌మ‌ర్పించారు. ఫోర్‌స్టార్ జ‌న‌ర‌ల్‌కు ఇలా 17 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పించ‌డం సంప్ర‌దాయం. ఇంత‌కీ, ఈ గ‌న్ సెల్యూట్ ఎందుకు చేస్తారు? 19 గ‌న్స్‌తోనే ఎందుకు చేస్తారు? ఎవ‌రెవ‌రికి ఎలాంటి గ‌న్ సెల్యూట్ ఇస్తారు? 

ఇండియ‌న్‌ ఇండిపెండెన్స్ డే, రిప‌బ్లిక్ డే సందర్భంగా 21 తుపాకులతో త్రివర్ణ పతాకానికి సైనిక‌ వందనం సమర్పిస్తుంటారు. 16వ శతాబ్ధంలో బ్రిటన్‌ నావికాదళం దీనిని ప్రారంభించింది. వంద‌నానికి శతఘ్నులు లేదా తుపాకులు వేటినైనా వాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఆచారాన్ని అనుస‌రిస్తున్నాయి. బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొందిన కామన్‌వెల్త్‌ దేశాల్లో ఈ సంప్ర‌దాయం ఎక్కువ‌గా కనిపిస్తుంది. 

దేశాధ్యక్షుడు, విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. సందర్భానికి అనుగుణంగా 19 గ‌న్స్‌, 17 గ‌న్స్ సెల్యూట్‌లు కూడా ఉంటాయి. రాష్ట్రపతికి 21 తుపాకుల వందనం ఇస్తారు. త్రివిధ దళాధిపతులకు 17 గన్‌ సెల్యూట్‌ సమర్పిస్తారు. 

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఫోర్‌స్టార్‌ జనరల్‌. ఆర్మీ చీఫ్‌, నేవీ చీఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌తో సమానమైన ర్యాంక్‌. అయినా, వీరందరిలోకి ప్రథముడు. అందుకే బిపిన్ రావ‌త్‌కు 17 గన్‌ సెల్యూట్‌తో సైనిక వంద‌నం సమర్పించారు. అందుకు వాడిన శ‌త‌ఘ్నుల‌ను 2233 ఫీల్డ్‌ రెజిమెంట్‌ నుంచి తీసుకొచ్చారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాకు సమానమైన ఆరుగురు అధికారులు ఫ్లాగ్‌ బేరర్లుగా వ్యవహరించారు. త్రివిధ దళాల్లోని కీల‌క‌మైన 800 మంది అధికారులు రావ‌త్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. 17 శ‌త‌ఘ్నుల‌తో భార‌త తొలి సీడీఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల‌కు సైనిక లాంఛ‌నాల‌తో తుది వీడ్కోలు ప‌లికారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...