Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ వాళ్ళకి షార్ప్ షూటర్లు భలే దొరుకుతారు
posted on: Apr 15, 2024 2:24PM
వైఎస్ ఫ్యామిలీకి ఎక్కడ దొరుకుతారోగానీ షార్ప్ షూటర్లు భలే దొరుకుతారు. గతంలో పరిటాల రవిని అంతం చేయడానికి మొద్దు శ్రీను లాంటి టాలెంటెడ్ షార్ప్ షూటర్ని ఎంకరేజ్ చేశారు. ఆ షార్ప్ షూటర్ తాను అనుకున్నది సాధించాడు. కోడి కత్తి డ్రామా సందర్భంలో కూడా ప్రాణం పోయే ప్రదేశాల్లో కాకుండా ఉత్తుత్తి చోట కాస్తంత కత్తి దిగబడేలా లాఘవంగా ఆపరేట్ చేయగలిగిన వ్యక్తి దొరికాడు. ఇప్పుడు తనమీద తాను గులకరాయి దాడి చేయించుకోవడానికి కూడా ఎవరో ప్రతిభావంతుడైన షార్ప్ షూటర్ ఎవరో దొరికాడు. ‘షార్ప్ షూటర్’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఎవరో రాయి చేత్తో విసరలేదు.. ఎయిర్ గన్ లాంటి దానితో షూట్ చేశారని వైసీపీ వాళ్ళే అంతా తెలిసినట్టు చెబుతున్నారు కదా.
ఏది ఏమైనా వైసీపీ వాళ్ళు నియమించుకున్న ఆ షార్ప్ షూటర్‌కి కమిట్ అయిన దానికంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే, అంతమంది మధ్యలో నిల్చుని వున్న జగన్‌కి మాత్రమే తగిలేలా, అది కూడా కంటికి కాకుండా కంటి పైన తగిలేలా, ఆ తగలడం కూడా పెద్ద గాయం లాంటిదేమీ కాకుండా చిన్న గాయం తగిలేలా షూట్ చేశాడు కదా. ఆ రాయి కణతకి తగిలి వుంటే జగనన్న పైకి టపా కట్టేసి వుండేవాడని డాక్టర్లు చెప్పారని అంటున్నారు. రాయి కణతకు తగలకుండా జాగ్రత్తపడ్డ సదరు షార్ప్ షూటర్‌కి వైసీపీ వాళ్ళంతా రుణపడి వుండాలి. కాకపోతే, పరిటాలను చంపేసిన షార్ప్ షూటర్ మొద్దు శ్రీను ఆ తర్వాత జైల్లో మర్డరైపోయాడు. కోడికత్తి శ్రీను మొన్నటి వరకూ జైలుకే అంకితం అయిపోయాడు. ఇప్పుడు ఈ షార్ప్ షూటర్ భవిష్యత్తు ఏమిటో!


.webp)
.webp)


