ఏపీ గవర్నర్ ఎవరో?

posted on: Jan 25, 2019 9:40AM

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఈ.ఎస్.ఎల్.నరసింహన్.. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా ఏపీకి కొత్త గవర్నర్ రాబోతున్నారు అంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ గవర్నర్ పదవికి ప్రధమంగా వినిపిస్తున్న పేర్లు..ఒకరు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ..మరొకరు మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా తనను నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిరణ్‌బేడీ ఖండించారు. అలాంటిదేమీ లేదని, అవన్నీ వదంతులేనని తెలిపారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు సాగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, పరిపాలన వ్యవహారాల్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. మొత్తానికి ఈ ఊహాగానాలకు కిరణ్ బేడీ తెర దింపేశారు.

ఇక మిగిలింది కృష్ణంరాజు. కృష్ణంరాజుకు బీజేపీ గవర్నర్ పదవి ఇచ్చేందుకు సిద్ధమైందని,ఈ మేరకు చర్చల కోసం ఢిల్లీకి రమ్మంటూ ఆయనకు పిలుపొచ్చిందని ప్రచారం జరుగుతుంది. అలాగే హీరో ప్రభాస్ కి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైందని,ఆయనకి ఉన్న క్రేజ్ ని వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై కృష్ణం రాజు ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో తదుపరి గవర్నర్ ఎవరా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...