ప్రైవేట్ ఆసుపత్రులలో సిటిజన్ చార్టర్ పెట్ట‌రా?

posted on: Sep 30, 2022 6:40AM

ఏ ఊరెళ్లినా, ఎక్క‌డ‌యినా దుకా ణం పేరు, వ‌స్తువుల ధ‌ర‌లు తెలియ‌జేస్తూ ఒక బోర్డు రాసి ఉంటుంది. క‌నీసం ఒక్కోవ‌స్తువు ఇంత అవుతుంద‌ని చెప్పేందు కు సిద్ధంగా ఉంటారు. పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో పేరు ఉండి లోప‌లికి వెళితే దేనికి ఎంత‌వుతుంది అనే ది అడిగానా పెద్ద‌గా చెప్ప‌క ర‌హ‌స్యంలా ఉంచి ఆ త‌ర్వాత భ‌య‌పెట్టేది మాత్రం ఆసుప‌త్రు లే! పూర్వం ఏ న‌ర్సో, కౌంట‌ర్లో క్ల‌ర్కో చెప్పేవారు త‌ల‌నొప్పి మం దుల‌కు ఇంత‌, చిన్నా ప‌రేష‌ న్‌కి ఇంత అని..ఇటీవ‌లి కాలంలో ప్ర‌యివేటు, ప్ర‌భుత్వ ఆసు పత్రు ల్లోనూ వేడుకున్నా ఎవ‌రూ చెప్ప‌డం లేదు. క‌నీసం ఆప‌రేష‌న్‌కి దాదాపు ఇంత అవ‌చ్చు అని అందాజా కూడా చెప్ప‌డం లేదు. ఎందుకు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. వాస్త‌వానికి సిటిజ‌న్ చార్ట‌ర్ ఏర్పాటు గురించిన ప్ర‌జ‌ల డిమాండ్ చాలాకాలం నుంచే ఉంది. కానీ ఆరోగ్యశాఖ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీన్ని ఆసుప‌త్రులు బాగా అనుకూలం చేసుకుంటు న్నాయి. 

ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్యుడి ని నిలువునా దోచేస్తున్నాయి. రోగులకు  సర్జరీకి అసలు అయ్యేది ఎంత? అన్న అంశం పై అటు రోగికి కాని రోగి బంధువుకు కాని కనీస అవగాహన లేకపోవడం తో ఆసుపత్రుల భాగోతం శ్రుతిమించుతోంది.జనరల్ వార్డ్ బెడ్ రోజుకు ఎంత? షేరింగ్ రూమ్ రోజుకు ఎంత? స్పెషల్ రూమ్ రోజుకు ఎంత ?అన్న విషయం   రోగి బంధువుకు  అవగాహాన లేదు సరికదా ఏ సర్జరీకి ఎంత అవుతుంది. ఆయా ఆసుపత్రులలో ఐ సి యు బెడ్ ఎంత? నాన్ ఏ సి బెడ్ ఎంత? రోజుకు ఎంత అన్న సమాచారం తప్పనిసరిగా సిటిజన్ చార్టర్ రూపంలో పెట్టాల్సిందే. అలాగే డాక్టర్ కన్సల్టెంట్ ఫి ఎన్నసార్లుకు వినియోగించ వచ్చు ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ వచ్చాక ఆయా ఆసుపత్రులలో ఎన్నిపడ కల ఆసుపత్రి ఏది ఎక్కడఉంది? ప్రతి టెస్ట్కు ఎంత ఖర్చు అవుతుంది అన్న సమాచారం సిటిజన్ చార్టర్ లో పెట్టాలి. అక్కడి డాక్టర్ల వివరాలు అయా శాఖలు. హెచ్ఓడి వివరాలు సిటిజన్ చార్టర్ లో చేర్చాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే, ఆసుప‌త్రికి వ‌చ్చిన రోగిని అనేక ప‌రీక్ష‌లు అతిగా చేసి చివ‌రికి పెద్దాప‌రేష‌న్ చేయాల‌ని వీల‌యితే వాడి ఆస్తంతా లాగేసుకునే ప్ర‌య‌త్నాలే చేస్తున్నాయి ఈరోజుల్లో ఆసుప‌త్రులు అనే అప‌వాదు ఉంది. అందుకే ఆసుప‌త్రికి వెళ్ల‌కుండానే ఉండాల‌ని కోరుకుంటున్నారు. అందుకే నాటువైద్యులు కూడా దేవుళ్ల‌యి కూర్చున్నారు. 

ఈ సిటిజన్ చార్టర్ ముఖ్య ఉద్దేశ్యం ఒకటే మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి పేరుతో వైద్యం చేసిన ఘటన వెలుగు లోకి వచ్చింది. మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకుండానే ఆసుపత్రిని నడుపుతూ రోజుకు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. గతంలో కీళ్ళ మార్పిడి సర్జరీకి లక్ష నుండి లక్షా యాభై రూపాయలు సర్జరీకి అయ్యేఖర్చు కోరోనా తరువాత కీళ్ళ మార్పిడి సర్జరీ నాలుగు లక్షలకు చేరింది ఇది ప్యాకేజి మాత్రమే. అయితే సర్జరీ తరువాత రోగికి వచ్చిన ఫైనల్ బిల్ ఎనిమిది లక్షలు దీంతో లబోదిబోమన్న రోగి అంత బిల్లు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడినించి తేవాలో అర్ధం కాక తీవ్ర విషాదం లో మునిగి పోయారు. ఇంతేకాదు కేవలం సర్జరీ కి చెప్పింది నాలుగు లక్షలయాభై వేలు. కాని వచ్చిన బిల్లు ఎనిమిది లక్షలు దిస్చార్జికి ముందు కట్టి వెళ్ళాలంటూ హుకూం జారీ చేసారు సదరు అకౌంట్స్ మేనేజర్  అప్పటికప్పుడు కట్టాలంటే ఇల్లె అమ్ముకోవాల్సిందే. మామూలు ప్యాకేజికి అదనంగా జిఎస్టే అంటూ అదనంగా,ఇతర సేవల రూపంలో దోచేయడం పై సామాన్యుడు తీవ్రఆందోళనకు గురిఅవుతున్నాడు. అప్పటి కప్పుడు అప్పుపుట్టడం అసాధ్యం. అసలు ఇన్సూరెన్స్ పోగా అదనపు భారంపడుతూ ఉండడంతో ఏమిచేయాలో అర్ధంకాక వెర్రి చూపు లు చూస్తూ చేసేది లేక కట్టే వెళుతున్నారు. ఇదే పరిస్థితి మధ్య తరగతి ఆర్ధికంగా దిగువన ఉన్నవాళ్ళకే వస్తే ఇంకే ముంది డబ్బు కట్టలేక ఆత్మహాత్య మినహా మరోమార్గం లేదని సామాన్యుడు వాపోతున్నాడు.
     
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్,లివర్  ట్రాన్స్ ప్లాంట్,హార్ట్  ట్రాన్స్ ప్లాంట్ కి ఎంత ఖర్చు అవుత్నుందో కూడా అంచనా వేయలేము. అసలు సస్త్రచికిచ్చల ఖర్చు సామాన్యుడు భరించగాలడా? వీటి వివరాలను అయ్యే ఖర్చును సిటిజన్ చార్టర్ లో పెట్టాలి అన్నది సామా న్యుడి డిమాండ్. సిటిజన్ చార్టర్ లో స్పష్టంగా ప్రక టించాలని. సాధారణ సర్జరీ లప్రో స్కోపిక్ సర్జరీ,బెరియాటిక్ సర్జరీ వికటించిన సందర్భాలు ఉన్నాయి.రోగి సర్జరీ టేబుల్ పైనే చనిపోయిన ఘటనలు చూసాం. అయితే సర్జరీ ముందుగానే వివరాలు చెప్పకుండా కేవలం కౌన్సిలింగ్ చేసి నిరయం కాకుండా సర్జరీకి వెళ్ళే ముందు ఎన్ ఓ సి పై సంతకం పెట్టించుకోవడం వంటి పద్దతికి స్వస్తి చెప్పాలి. రోగి పూర్తి బాధ్యత ను ఆసుపత్రి తీసుకోవాలి. రోగికి చేస్తానన్న సర్జరీ కాక మరో సర్జరీ చేసినా, చెప్పిన ప్యాకేజికి బదులు అదనపు ప్యాకేజి కింద అదనపు డబ్బు వసూలు చేసినా చట్ట పరమైన చర్యలు తీసు కునే వీలును ప్రభుత్వం కల్పించాలని. ఒక వేళ రోగి ఏ పరిస్థితిలో చనిపోయినా పూర్తి బాధ్యత నష్టపరిహారం ఆసుపత్రి చెల్లించే వీలునుకల్పించి సామాన్యుడి ఆరోగ్యానికి బద్రత దోపిడీని నివారించే ఆరోగ్య బిల్లును పర్ల్యమేంట్ లో ప్రవేసపెట్టాలని ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసే వీలును కల్పిస్తూనే సామాన్యుడి ప్రజా ఆరోగ్యా నికి పెద్ద పీట వేసే విధంగా ఆరోగ్య శాఖ కసరత్తులు చేయాలాని సామాన్యుడు మొర పెట్టుకుంటు న్నాడు.

ఏ సర్జరీకి ఎంత రేటుననుస‌రించి సర్జరీ నిర్ధారిస్తారు. ఏఫారిన్ బాడీ వాడతారు. సర్జరీకి వాడే స్టంట్, లెన్స్ వాటి వివరాలు రోగి ఎంచుకున్న సర్జరీ విధానాన్ని సర్జరీకి పట్టే సమయం వాటితో పాటు ఎంతమంది సర్జరీ చేస్తున్నారు వారి వివరాలు రోగి బందు వు లకు అందించాలి ఆతరువాతే ఎన్ ఓ సి పై సంతకాలు పీట్టె వీలును రోగికి రోగి తాలూకు  బంధువుకు వివరించాలని సామ న్యుడు సూచిస్తున్నాడు. ఆ త‌ర్వాత‌నే ఏ కేటగిరీ రూమ్ రెంట్ నర్సింగ్ సేవల ఖర్చు, అత్యవసర సమయంలేదా సర్జరీ సమ యంలో వినియోగించిన ఇతర సామాగ్రి మందులు సైతం రోగికి లేదా రోగి బంధువులకు ఖచ్చితంగా తేలపాలాని ఏ సేవ చేసినా అయ్యే ఖర్చు అదనపుఖర్చు ఎంత అనే వివరాలు పూర్తిగా సిటిజన్ చార్టర్లో పొందుపరచాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఊహించని బిల్లుల తో అతలాకుతలం అయిపోతున్నాడు అసలు సామాన్యుడి కి వైద్యం తీసుకోవాలంటే ముందు నుయ్యి వేనుకగోయ్యి మాదిరిగా కనిపిస్తోందని దీనికి బదులు చనిపోతే బాగుం డునని రోగులు వాపోతున్నారంటే పరి స్థితి ఎలా ఉందొ రోగి బంధువులు రోగి తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. పిర్రచూసి పీట కన్నుచూసి కాటుక వేసారు అన్నట్లు రోగిని బట్టి ఆర్ధిక స్థితినిబట్టి ఆరోగి ఏ కేట గిరి కిందకు వస్తుందో ఆ కేటగిరీ కింద ఇచ్చేసేవలు వాటికి ఆయ్యే ట్రీట్మెంట్ ఖర్చు ఐసియు లో య్యేఖర్చు,సాధారణ చికిత్చకు వినియోగించే వస్తువులు. చికిత్చ వివరాలు చికిత్చకు వినియోగించిన పూర్తివివరాలు ఆహారంతోపాటు ఇతర డాక్టర్ల సేవలకు తీసుకునే ఫీజుతో సహా సిటిజన్ చార్టర్ లో పొందుపరచా లని సామాన్యుడు డిమాండ్  చేస్తున్నాడు.

మారో అంశం ఏమంటే,  ఆసుపత్రి పేర్లు మారితే ధరలు మారతాయా? ప్రైవేట్ ఆసుపత్రుల పై అజమాయిషీ ఎవరిదీ సేవారంగా నికి చెందినా వైద్యం విషయంలో రాష్ట్రప్రభుత్వాల పరిధిలో అంశమా కేంద్రానికి సంబంధం లేదా సామాన్యుడికి ఈ ధరా ఘాతం నుండి బయట పడాలంటే ఏది మార్గం అన్నసామాన్యుడుప్రశ్నలకు సమాధానం ఎవరు ఇస్తారు. ప్రభుత్వాలు తమ ఆరోగ్య విధానంలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి వివరాలు,వారిన్ నైపుణ్యం,వివరాలు సిటిజన్ అందించే సేవలు ఎవరు అందిస్తారు అన్న విషయం కాంటాక్ట్  నంబర్స్ కూడా అందించాలాని  ఆసుపత్రిలో రోగికి ఏ డాక్టర్ చికిత్చ చేస్తున్నాడు. ఆయా ఫ్లోర్ మేనేజర్స్ వివరాలు నర్సింగ్ స్టేషన్ ఫోన్ నెంబర్ వివరాలతో ఇన్‌ఫ‌ర్మేష‌న్ షీట్‌ తప్పనిసరిగా రోగి చేరికకు ముందే ఇవ్వాలని సామాన్యు డు కోరుకుంటున్నాడు.ఆసుపత్రుల డమాండ్ తట్టుకోవాలంటే లక్షలు ఎలాసంపాదించాలి అన్న మనోవేదనతో రోగి ముందే గుండెపోటు తెప్పించి విధానానికి ఇప్పటికైనా చెక్ పెట్టాలని కోరుతున్నాడు.

75  సంవత్సరాల స్వతంత్ర దేశ చరిత్రలో ప్రజారోగ్యానికి అసలు ప్రభుత్వాలు ఖర్చుచేసింది ఎంత పట్టణాలలో దోపిడీకి గ్రామా ల్లో కార్పోరేట్ అసుపత్రులపై నియంత్రణ అవసరం. ఆసుపత్రులలో ధరల నియంత్రణకు సిటిజన్ చార్టర్ ఏర్పాటూ అంతే అవ స‌రం. లేదంటే భ‌విష్య‌త్తులో ప్ర‌జారోగ్యం గాలిలో దీపం లాగానే ఉంటుంది. ఆరొగ్యానికీ రక్షణ ఎవడు. బిల్లు పోటును ఆపేది ఎవరు అన్నది మారో ప్రస్నమిగిలింది. ప్రజారోగ్యానికి ఏ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఆయా పార్టీలు తమ మ్యాని ఫెస్టోలో స్పష్టంగా పేర్కొనాల‌ని సామాన్యుడు కోరుకుంటున్నాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...