మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నం
Published on: Fri Nov 14, 2014 9:07AM

పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్ కోల్‌కతా జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన 58 నిద్రమాత్రలు మింగారు. కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. శారదా గ్రూపు చిట్ఫండ్ కుంభకోణంలో కునాల్ ఘోష్ మీద ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను బహిష్కరించింది. రాజ్యసభ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ గత ఏడాది నవంబర్లో అరెస్టయ్యారు. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన కునాల్ ఘోష్ మీద చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి.


