Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రికెట్.. సమ్ టైమ్స్ క్రై కెట్!
posted on: Jun 6, 2025 3:09PM

ఇప్పటి వరకూ అత్యధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్పటి వరకూ వరల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంతగా మరే దేశం శాసించలేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. తర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజయ పరంపర అందిపుచ్చుకుంది. అంతగా వారు క్రికెట్ లో గెలుపు రుచి చూశారు.
అత్యధిక వన్డే వరల్డ్ కప్పులు కొల్లగొట్టిన వీరు ఎప్పుడూ ఏడవలేదు. పై పెచ్చు.. కమిన్స్ నాయకత్వంలో గెలిచిన గత వరల్డ్ కప్పును తమ కాలి కింద వేసుకుని.. వరల్డ్ క్రికెట్ మా పాదాక్రాంతం అన్న సంకేతాలనిచ్చారుగానీ ఎప్పుడూ ఎడవలేదు.
అపురూపమైన విజయాలు ఎదురైనపుడు ఏడ్చిన వారు చాలా చాలా తక్కువ. గతంలో శ్రీలంక మీద వేగవంతమైన శతకంతో సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడుగానీ ఏడవలేదు.
ఈడెన్ టెస్టులో హ్యాట్రిక్ వికెట్ తీసినపుడు.. హర్బజన్ ఏడవలేదు ఎంజాయ్ చేశాడు. ఇదే మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్ అపూర్వమైన 287 పరుగులు చేసినపుడు కూడా ఏడవలేదు. ఆనందంతో సెలబ్రేషన్ చేసుకున్నాడు. వెస్ట్ ఇండీస్ మీద 329 పరుగుల టార్గెట్ చేసిన రాహుల్ ద్రావిడ్ చివరి బంతికి బౌండరీ కొడతారని ఊహించారు కానీ సింగిల్ తీసి కేవలం బ్యాట్ పైకెత్తి గెలుపు ఆనందాన్ని వ్యక్తం చేశాడంతే.
లార్డ్స్ లో గంగూలీ షర్ట్ విప్పి గాల్లో తిప్పడం ద్వారా ఇండియా విజయాన్ని కాస్త ఎమోషనల్ చేశాడు. అంతే తప్ప ఏడవలేదు. అయితే ఇది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక మరపురాని మైలురాయిలాంటి విజయం. ఇక్కడి నుంచి భారత్ మరింత పటిష్టపడుతూ వచ్చిందని అంటారు.
ధోనీ సారధ్యంలో రెండు ప్రపంచ కప్పులు గెలిచినపుడు కూడా ఏడవలేదు. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాడు. అసలు ధోని గెలిచినపుడే కాదు ఓడినపుడు కూడా ఏమంత భావోద్వేగానికి గురి కాడు. ఐపీఎల్లో ఎన్నో సార్లు అవలీలగా ట్రోఫీలు ఎత్తాడు. అంతే స్థాయిలో ఈ సారి తన జట్టు పరాజయం పాలైనా పెద్దగా పట్టించుకోలేదు. గేమ్స్ లో గెలుపోటములు కామన్ అన్నది ధోని మార్క్ సారధ్యం.
సచిన్ కి అదే చివరి టోర్నమెంట్ అయినపుడు ఎవరూ ఏడు మొహం పెట్టలేదు. ఆ ఛాయలు తన మొహంలోనూ కనిపించలేదు. బ్యాటుకీ బాలుకీ పిచ్ కీ సచిన్ కి అంతటి అనుబంధం. కానీ వాటిని వదులుతున్నపుడు ఎలాంటి ఏడుపులు పెడబొబ్బలు పెట్టలేదతను.
మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినపుడు ఫైనల్స్ లో సిరాజ్ ఏడవలేదు. కానీ, భారత్ గెలిచినపుడు అతడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడన్నది తెలీదు.
ఇదే ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సైతం తన ఫస్ట్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ మాత్రమే చేసినపుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎందుకలా అయ్యాడంటే అతడు చిన్నపిల్లాడు కాబట్టి అది సహజం కదా అనుకున్నారంతా. ఆ మాటకొస్తే గతంలో వినోద్ కాంబ్లీ శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఔట్ అయినపుడు కూడా ఇలాగే భావోద్వేగానికి గురయ్యాడు.
లేటెస్టుగా ఐపీఎల్ ఫైనల్ చివరి ఓవర్ నుంచే విరాట్ ఏడుపు మొహం పెట్టుకుని కనిపించాడు. ఏడుపు వస్తోందని సైగ చేశాడు. గెలుపు ముందు క్షణాలు అంటే చివరి ఓవర్ రెండో బంతి నుంచి ఏడవడం మొదలు పెట్టాడు.
ఆటల్లో గెలిచినపుడు ఆనందించాలిగానీ ఈ ఏడుపులేంటి? ఇవే ఒక్కోసారి విషాదాంతాలకు దారి తీస్తాయనడానికిదో నిదర్శనంగా విశ్లేసిస్తున్నారు కొందరు క్రికెట్ ఎనలిస్టులు



.webp)


