TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరంగల్ కు గుత్తికోయల బెడద

Published on: Tue Apr 3, 2012 9:18AM

వరంగల్ జిల్లాకు గుత్తికోయల రూపంలో కొత్త బెడద ఎదురైంది. ఛత్తీస్ ఘడ్ నుంచి గోదావరి నది దాటి పెద్ద ఎత్తున గుత్తికోయలు జిల్లాలోని ఏటూరి నాగారం, మండపేట, తాడువాయి మండలాల్లోని అటవీ ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు వారిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం నెలకొల్పిన సల్వాజుడుం కార్యకర్తలకు మది జరుగుతున్న పోరులో గుత్తికోయలు నలిగిపోతున్నారు. ఈ పోరునుంచి తప్పించు కునేందుకు గుత్తికోయలు పెద్దసంఖ్యలో గోదావరి నది దాటి వరంగల్ జిల్లాలో ప్రవేశిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వీరు అడవులను నరికి సేద్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు .సహజంగా గిరిజనులు ఇటువంటి వ్యవసాయం తరతరాలుగా చేస్తూనే ఉన్నారు.

కానీ ఈ గుత్తికోయలను మావోయిస్టులు మచ్చిక చేసుకుంటున్నారన్న వార్తలు జిల్లా యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పలుప్రాంతాల్లో గుత్తికోయలతో మావోయిస్టులు సమావేశమయినట్లు పోలీసులు గమనించారు. అంతేకాక కొందరు గుత్తికోయలు మావోయిస్టుల వెంట తిరుగుతున్నట్లు కూడా తెలిసింది. అమాయకులైన గుత్తికోయలు మావోయిస్టు దళాల్లో సభ్యులుగా చేరితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న భయాందోళనలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీరికి పునరావాసం కల్పించవలసిందిగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతున్నారు.