కేసీఆర్ రావడమే ఆలస్యం.. వెంటనే ప్రకటన


 


వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికకు పోటీచేసే విషయంపై టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కుదిరినట్టు, టీడీపీ బీజేపీకే ఆఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చర్చమొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంపైనే జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీ తరుపున ఎవరు బరిలో దిగుతారు అన్న విషయంపై ఇంతవరకూ ఓ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. ఆయన వస్తేకాని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంతో కేసీఆర్ ఢిల్లీ నుండి తిరిగి రాగానే పార్టీ నేతలతో..వరంగల్ జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనేథ్యంలో రేపు కేసీఆర్ పార్టీ నేతలతో భేటీకానున్నారు. కాగా ఇప్పటికే ఈ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ నుండి పదవిని ఆశిస్తున్న వారిలో పసునూరి దయాకర్.. గుడిమల్ల రవికుమార్.. ప్రొఫెసర్ సాంబయ్య.. డాక్టర్ రమేశ్.. ఎర్రోళ్ల శ్రీనివాస్.. కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కడియం శ్రీహరి మాత్రం తన కూతురు ఈ బరిలో లేదని తేల్చి చెప్పారు.

అయితే వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పోటీ చేసే అభ్యర్ధి విషయంలో కేసీఆర్ పూర్తి అవగాహనతో ఉన్నారని.. ఈవిషయంలో కేసీఆర్ ఎప్పుడో క్లారిటీతో ఉన్నారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. అత్యంత ప్రాముఖ్యమైన వరంగల్ ఉపఎన్నిక విషయంలో కేసీఆర్ ఎప్పుడో కసరత్తు చేశారని.. అభ్యర్ధి ప్రకటన విషయంలో సరైన సమయం కోసం చూస్తున్నారని అనుకుంటున్నారు. ఏదీఏమైనా కేసీఆర్ ఎప్పుడో ఫిక్స్ అయిన అభ్యర్ధి ఎవరో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.