తెలంగాణ బిల్లుపై ఓటింగ్ తప్పనిసరి: కిరణ్

 

 

 

తెలంగాణ బిల్లుపై సోమవారం నుంచి చర్చ మొదలవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం అంటే ఓటింగే అని స్పష్టం చేశారు.చ ర్చలో పాల్గొని బిల్లుపై అభిప్రాయం చెబితేనే రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటారని సీఎం వెల్లడించారు. అసెంబ్లీ అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, దేశంలో ఓటింగ్ లేకుండా ఏ రాష్ట్రం ఏర్పడలేదని గుర్తుచేశారు.


కాంగ్రెస్‌లో రాజకీయ భవిష్యత్ ఉండదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 23 తర్వాత రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమై ఏం చేయాలనేది చర్చిస్తామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ళకు రూ.38 వేల కోట్లు ఖర్చవుతున్నపుడు... చిత్తూరుకు ఆరువేల కోట్లు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు నష్టమే అని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఏటా రూ.60వేల కోట్లు కావాలని, విభజన జరిగితే సంక్షేమ పథకాలకు నిధులు ఉండవన్నారు. శ్రీధర్‌బాబు రాజీనామా లేఖ అందినట్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.