సర్వీస్ ప్రొవైడర్లది కోర్టు ధిక్కారం

posted on: Jul 17, 2015 4:34PM

 

ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై ఈ రోజులో వాదనలు జరిగాయి. అయితే వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వద్దని మెమో ఫైల్‌ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించిందని, అందుకే కాల్‌డేటా ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ల తీరును అడ్వకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌ తప్పుబట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని కానీ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఈ కేసులో కాల్ డేటా ఇవ్వకపోవడం నేరమని.. కోర్టు అడిగిన సమాధానం ఇవ్వకపోవడం కోర్టు ధిక్కారం అవుతుందని.. ఇది ఐపీసీ 174 సెక్షన్‌ కింద నేరమని అన్నారు. అనంతరం సర్వీస్ ప్రొవైడర్లు తరపు న్యాయవాది తమకు డేటా ఇవ్వాల్లా వద్దా అన్న విషయాన్ని పరిశీలించేందుకు వారం రోజుల సమయం కావాలని కోర్టును కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...