Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వోల్వో బస్సు అగ్ని ప్రమాదం: 40 మంది సజీవదహనం!
posted on: Oct 30, 2013 9:53AM

ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపేట మండలం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. బెంగుళూరునుంచి హైదరాబాదు వస్తున్న ఒక వోల్వో బస్సు మహబూబ్‌నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరింగింది. ప్రమాద సమయంలో బస్సుల 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే..డిజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు దహనం అయినట్టు సమాచారం. మెలకువగా ఉన్న డ్రైవర్‌తో సహ ఆరుగురు ప్రమాదం నుంచి బయట పడినట్టు సమాచారం.
ఇది జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. కొందరు వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవరు, క్లీనరు పోలీసులో అదుపులో ఉన్నట్లు సమాచారం. జబ్బార్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధులు వస్తే తప్ప అసలు బస్సులో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడి కాకపోవచ్చునని తెలుస్తోంది.


.jpg)



