Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరిన్ని చిక్కుల్లో విడదల రజిని..మాజీ ఎంపీ గోరంట్లకు పట్టిన గతేనా?
posted on: May 10, 2025 4:44PM

వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజినికి మరో చిక్కుల్లో పడింది. ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్న సమయంలో విధినిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. వారి విధులకు ఆటంకం కలిగించింది. తన అనుచరుడు అరెస్ట్‌కు కారణం చెప్పాలని సీఐ సుబ్బారాయుడును నెట్టేశారు. విడదల రజిని ప్రవర్తన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ దాడిచేసి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించారు.
చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా మాధవ్ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్‌చల్ సృష్టించారు. దీంతో గోరంట్ల పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వరుసగా వైసీపీ నాయకులు పోలీసుల పై వీధి రౌడీలా విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయంలో పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.






