Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎప్పుడూ బలహీనంగా అనిపిస్తుందా? ఈ 3 విటమిన్ల లోపమే కారణమట..!
posted on: Aug 6, 2024 9:29AM
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర, అలవాట్లు బాగుండాలి. అయితే ఇవన్నీ చక్కగా పాటిస్తున్నా సరే బలహీనత ఫీలవుతూ ఉంటారు. ఏ చిన్న పని చేసినా అలసట అనుభూతి చెందడం, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, బాగా నీరసంగా ఉందని కంప్లైంట్ చేయడం చేస్తుంటారు. అయితే ఇది కేవలం మూడు రకాల విటమిన్లు లోపించడం వల్ల ఎదురయ్యే సమస్య అని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
విటమిన్-డి..
విటమిన్-డి అనేది సూర్యరశ్మి శరీరానికి అందడం ద్వారా శరీరంలో తయారవుతుంది. విటమిన్-డి లోపిస్తే రోజంతా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. వర్షాకాలంలో విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు, ఇల్లు దాటి బయటకు రానివారు, సూర్యరశ్మికి, బయటి వాతావరణానికి దూరంగా ఉండేవారు విటమిన్-డి లోపానికి ఎక్కువగా గురి అవుతారు. ఈ విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి పుట్టగొడుగులు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి.
విటమిన్-బి12..
విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే నరాల సమస్యలు వస్తాయి. ఇది లోపిస్తే శరీరం ఎప్పుడూ అలసట అనుభూతి చెందుతూ ఉంటుంది. విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి గుడ్లు, చేపలు, మాంసం, పాలు, గింజలు మొదలైనవి తీసుకోవాలి.
విటమిన్-సి..
విటమిన్-సి లోపిస్తే ఎప్పుడూ నిద్ర మత్తుగా అనిపిస్తుంది. అంతేకాదు ఎక్కువగా నిద్రపోతారు. కండరాలలో నొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా జామ, నారింజ, బ్రోకలీ బాగా తినాలి.
*రూపశ్రీ.



.webp)


