TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంధత్వం అడ్డుకాలేదు

Published on: Sat May 2, 2015 11:26AM

 

మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న, ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు 11 ఏళ్లు బాలుడు. తమిళనాడుకు చెందిన శ్రీరామానుజన్ అనే బాలుడు ఏ తమిళ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసి అందరిని ఆశ్ఛర్యపరిచాడు. అందులో ఆశ్చర్య ఏముంది అంటారా... 11 ఏళ్ల శ్రీరామానుజన్ పుట్టుకతోనే చూపును కోల్పోయాడు. ఏదైనా సాధించాలనే తపనతో, తన లాంటి వారికి స్ఫూర్తి దాయకంగా నిలవాలని మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. 22 నిమిషాల బులిటెన్ ను బ్రెయిన్ లిపి ద్వారా చదివి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఛానల్ ఛైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి ఒక బులిటిన్ మాత్రమే శ్రీరామానుజానికి ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు.