విరోష్ డబుల్ వెడ్డింగ్... స్పెషాల్టీ ఏంటో తెలుసా?
posted on: Feb 26, 2026 12:01PM

ఒకే రోజు రెండు సార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగనుంది. అవే తెలుగు, కొడవ సంప్రదాయాల్లో జరిగిన పెళ్లిళ్లు. తెలుగు సంప్రదాయం అంటే మనకు తెలిసిందే. కొడవ సంప్రదాయ పెళ్లి ఎలా జరుగుతుంది? ఇందులోని కీలకాంశాలేంటి? అన్న చర్చకు తెరలేచింది.
ఈ జంట పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ మాత్రమే కాదు.. వెడ్డింగ్ ఉడ్ కూడా. అదేంటి? అని చూస్తే వివాహ సంప్రదాయంలో రెండు భిన్నమైన సంప్రదాయాలతో జరుగుతున్న ఈ పెళ్లి.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. నేడు విరోష్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
విజయ్ దేవరకొండది తెలుగు కుటుంబం కాబట్టి తెలుగు సంప్రదాయంలో ఉదయం 9-10గంటల మధ్య ఒకసారి, రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ ఫ్యామిలీ అమ్మాయి కాబట్టి కొడవ కల్చర్ లో సాయంత్రం ఇంకోసారి పెళ్లి జరుగుతోంది.
విరోష్ వెడ్డింగ్ కొడవ సంప్రదాయంలో ఎలా జరుగుతుందనేది ప్రెజంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు కొడవ పెళ్లి అంటే ఏంటీ? అనేది ఇంట్రెస్టింగ్ టాపిగ్గా మారింది. తెలుగు పెళ్లిళ్లలో వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేస్తాడు. అంటే తెలుగు సంప్రదాయంలో మాంగళ్యధారణ అత్యంత ముఖ్యమైన ఘట్టం. కానీ కొడవ సంప్రదాయంలో ఇలాంటిదేదీ ఉండదు.
కొడవ సంప్రదాయంలో పురోహితుల ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమే. కేవలం పూర్వికుల ఆశీర్వాదాల ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. ఇక తెలుగు పెళ్లిలో.. బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒడిబియ్యం, సంప్రదాయం, తలంబ్రాలు, అక్షింతలు అంటూ రకరకాలుగా బియ్యం వాడకం కనిపిస్తుంది. కానీ కొడవ సంప్రదాయంలో ఒడి బియ్యం స్థానంలో వధువు కాసుల మూట పట్టుకొస్తుంది.
ఇక కొడవ సంప్రదాయంలో వధూ వరుల వస్త్రధారణ కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. మన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తుంది. పురుషులు కుప్పస అనే నల్లటి పొడవైన కోటు ధరిస్తారు. దానికి దట్టీఅనే ఎర్రటి పట్టు వస్త్రం కట్టుకుంటారు. ఇక నడుముకు కుడివైపు పిచే కత్తి అనే చిన్న కత్తిని అలంకరించుకుంటారు. ఇది వారి వీరత్వానికి నిదర్శనంగా భావిస్తారు. దీంతో పాటు తలపై పగడి కూడా ధరిస్తారు.
మహిళలు కట్టుకునే చీర కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వస్త్ర ధారణే పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ. ఇక పెళ్లికూతురు తల్లికి ఈ వేడుకలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొడవ పెళ్లి వంటలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని అంటారు. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక ప్రత్యేక బిసిబేళా బాత్, కూర్గ్ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. కొడవ సంప్రదాయం ప్రకారం పోర్క్ కర్రీకి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో విరోష్ అనే ఎంబ్రాయిడరీతో స్పెషల్ డెకరేషన్ చేశారు. ఇప్పటికే విరోష్ పెళ్లి ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి. ఉదయ్ పూర్ లోని మెమెంటోస్ ఐటీసీ హోటల్లో ఎంతో గ్రాండ్ గా జరుగుతోంది. ఇప్పటికే మెహందీ ఈవెంట్, ఆ తర్వాత హల్దీ, సంగీత్ జరగ్గా.. ఇక చివరిగా పెళ్లివేడుక.. ఈ ఉదయం ఎనిమిదింటికి ఘనంగా జరగడంతో రష్మిక మందాన- విజయ్ దేవరకొండ జంట ఒక్కటయ్యింది.
ఈ పెళ్లిని కేవలం కొందరు ఎంపిక చేసిన కుటుంబ సభ్యులు ఇతర బంధుమిత్రుల మధ్య మాత్రమే జరుగుతోంది. ఈ సెలబ్రిటీస్ కోసం ఉదయ్ పూర్‌కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఒక ప్రైవేట్ రీసార్ట్‌ని బుక్ చేశారు. ప్రైవేట్ హెలీ ప్యాడ్ గల ఈ రీసార్ట్ లో ఒక నైట్‌కి 20 వేల నుంచి 70 వేల వరకూ రెంట్ ఉంటుంది. వీఐపీలు వస్తుండటంతో.. ఎయిర్ పోర్టు దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మిగిలిన వారి కోసం మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణలో విందు అత్యంత ఘనంగా జరగనుంది. విరోష్ పెళ్లి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెబుతూ ఒక సందేశం పంపారు.







