TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తొక్కిసలాట ఘటనపై మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం

Published on: Thu Jun 5, 2025 4:13PM

 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో  మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.  ఈ దురదృష్టకర ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి  స్పందిస్తూ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఐపీఎల్ ఫైనల్ ముగిసి, బహుమతుల ప్రదానోత్సవం పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీ తమ హోమ్ గ్రౌండ్‌లో ఏం చేస్తుందనే దానితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండదు అని స్పష్టం చేశారు

. (ఆర్సీబీ) మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి లేదు" అని ఆయన స్పష్టం చేశారు.బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ లేదా వేడుకలు ప్లాన్ చేసినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరు దీనిని నిర్వహించారో, అంతమంది అభిమానులు ఎలా అక్కడికి వచ్చారో మాకు తెలియదు" అని సైకియా తెలిపారు.నిన్న  చిన్నస్వామి స్టేడియం ఈ ఘటనలో 11  మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా సంగతి తెలిసిందే