Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్ళీ పెళ్ళి చేసుకున్న వినోద్ కాంబ్లి
posted on: May 5, 2014 4:23PM

మాజీ క్రికెటర్, మొన్నీమధ్యే గుండెపోటుకు గురై కోలుకున్న వినోద్ కాంబ్లీ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. వినోద్ కాంబ్లీకి ఇప్పటికే ఆండ్రియా హెవిట్ అనే మహిళతో పెళ్ళయింది కదా.. వీళ్ళిద్దరికీ జీసస్ క్రిస్టియానో అనే కొడుకు కూడా వున్నాడు కదా.. తీవ్రమైన గుండెపోటు వచ్చి, చావుదాకా వెళ్ళొచ్చి కోలుకున్న కాంబ్లీని పెళ్ళి చేసుకోవడానికి ముందుకొచ్చిన ఆ అమాయకురాలెవరు.. ఈ సందేహాలన్నీ వస్తున్నాయి కదూ?!
ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాం. వినోద్ కాంబ్లీ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.. అయితే పెళ్ళి చేసుకుంది ఎవర్నో కాదు. తన భార్య ఆండ్రియా హెవిట్‌నే! కొడుకు సాక్షిగా వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని సెయింట్ పీటర్స్ చర్చ్ లో జరిగిన వేడుకలో కాంబ్లి తన భార్య అండ్రియా హెవిట్‌నే కాథలిక్ సంప్రదాయంలో పెళ్లాడాడు. కాంబ్లి, ఆండ్రియా మొదటిసారి పెళ్ళిచేసుకోవడానికి ముందు చాలాకాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత కోర్టు ద్వారా వినోద్, ఆండ్రియాలు తమ వైవాహిక సంబంధానికి చట్టబద్దత కల్పించుకున్నారు.
కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, ఆ తర్వాత బతికి బయటపడిన కాంబ్లీ ఆధ్యాత్మిక చింతనకు లోనయ్యాడట. దాంతో దేవుడి మీద నమ్మకం పుట్టేసి తన భార్యని ఈసారి సంప్రదాయ పద్ధతిలో పెళ్ళాడాలని ఈ ‘సెకండ్ మ్యారేజ్’ కార్యక్రమం పూర్తి చేశాడట. ఆండ్రియాల వివాహ వేడుకకు బాలీవుడ్ నటులు అశుతోష్ రానా, ఆయన సతీమణి, నటీమణి రేణుకా సహానీలు హాజరయ్యారు.



.jpg)


