మీ ఇంటికి బొజ్జ గణపయ్యలు

Publish Date:Sep 15, 2015

 

నిన్నటి వరకు ఆన్ లైన్ షాపింగ్ అంటే ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఇతర హోమ్ నీడ్స్ ఇవే ఉండేవి. ఇప్పుడు వీటి ప్లేస్ లోకి గణనాథుడు కూడా వచ్చేశాడు. ఒక్క క్లిక్ తో బొజ్జగణపయ్య మీ ఇంటికొచ్చేస్తానంటున్నాడు. ఆన్ లైన్ లో మీ ఆర్డర్ల కోసం వెయిట్ చేస్తున్నాడు వినాయకుడు. గణేష్ చతుర్థి దగ్గర పడటంతో సిటీలో విగ్రహాలు అమ్మకాలు జోరందుకున్నాయి. నగరంలో ఎక్కడా చూసిన వినాయక ప్రతిమలు సందడి చేస్తున్నాయి. దీనికి తోడు ఆన్ లైన్ లో విగ్రహాన్ని బుక్ చేసుకునే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చేసింది. డిఫరెంట్ సైజులు, వెరైటీ వినాయక విగ్రహాలు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. వెబ్ సైట్ లో నచ్చిన విగ్రహాలను ఎంచుకొని ఆర్డర్ చేస్తే చాలు 24 గంటల్లో డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు సేల్స్ పర్సన్స్. వినాయక విగ్రహాలను ఆన్ లైన్ లో సేల్ చేయటం ఇదే ఫస్ట్ టైం.

By
en-us Life Style News -