కాంగ్రెస్ లోకి రఘునందన్ రావు

posted on: Aug 20, 2013 11:25AM

 

Raghunandan Rao congress, congress Raghunandan Rao, Vijayashanti Raghunandan

 

 

మెదక్ ఎంపీ విజయశాంతి, టిఆర్ఎస్ మెదక్ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునందనరావులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఈ పరిణామమే ఇప్పుడు ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎంపీ విజయశాంతి ఇంట్లో పద్మాలయ స్టూడియో భూముల సెటిల్మెంట్ జరిగిందని, విజయశాంతి భర్త చేతుల మీదుగా రూ.80 లక్షల రూపాయలు చేతులు మారాయని రఘునందనరావులు కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. అయితే ఆరోపణలన్నీ తేలిపోవడంతో రఘునందన్ రావు వెనక్కి తగ్గాక మెల్లగా విజయశాంతి బయటపడ్డారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారన్నమాట.

google-ad-img
    Related Sigment News
    • Loading...