Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిన్నమ్మతో రాములమ్మ మంతనాలు
posted on: Jan 5, 2019 9:50AM

సీనియర్ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఈ వారం ప్రారంభంలో శశికళతో ములాఖత్ అయ్యారని బెంగళూరు కారాగార అధికారులు శుక్రవారం ధ్రువీకరించారు. అక్రమాస్తుల కేసులో శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. శశికళతో విజయశాంతికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె శశికళను కలుసుకున్నారు. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ ఉండాలని విజయశాంతి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తంచేశారు. అంతేకాకుండా, జయలలిత మరణం కారణంగా జరిగిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల సమయంలో కూడా శశికళ బంధువు దినకరన్ తరపున విజయశాంతి ప్రచారం కూడా చేశారు.
కాగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శశికళ స్థాపించిన 'అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ’ మద్దతు కోరేందుకు విజయశాంతి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ విషయమై విజయశాంతి వద్ద శశికళ ఆరా తీశారని సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సమానదూరం పాటించాలన్న ఉద్దేశ్యంతోనే శశికళ ఫెడరల్ ఫ్రెంట్‌పై ఆరా తీసినట్టు తెలుస్తోంది.






