వియ‌త్నాం యుద్ధ భీభ‌త్సానికి  సాక్షి ఫాన్ థీ

posted on: Jul 12, 2022 5:40PM

ప్ర‌పంచంలో ఏ యుద్ధ‌కాలం అన్నా  వెన్నులో వొణుకుపుడుతుంది. అటువంటిది 1972లో వియత్నాం సైగాన్ వెలుపల ఒక ఫోటోగ్రాఫర్ భయంకరమైన చిత్రాన్ని తీయడానికి ముందు, ఆకాశం నుండి నిప్పులు వ‌ర్షం కురిసింది, అది నన్ను తాకింది, కిమ్ ఫుక్ ఫాన్ థీ ఆమె కాలిపోయిన క్షణం  గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంది.

వియత్నాం యుద్ధం తాలూకు క్రూరత్వానికి తెలియకుండానే ఆమె మారిన యాభై సంవత్సరాల తర్వాత, కిమ్ ఫుక్ ఫాన్ థీ శాంతి కోసం యునెస్కో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆమె కిమ్ ఫౌండేషన్ ఇంట ర్నేషనల్‌ను నడుపుతోంది, ఇది పిల్లల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథ శరణాలయాలు లైబ్ర రీలను ఏర్పాటుచేయ‌డంలో సహాయపడుతుంది. ఇటీవల ఆమె కెనడాలో పునరావాసం కోసం వారి ప్రయాణంలో ఉక్రెయిన్ నుండి శరణార్థులతో కలిసి వచ్చింది.

పిల్లలకు అవసరమైన ప్రతిచోటా నేను వెళ్తాను అంటూ ఆమె తన ప్రపంచ ప్రయాణాల గురించి చెప్పిం ది.  నేను నా కథను విద్యార్థులతో పంచుకుంటాను. యుద్ధం ఎంత భయంకరమైనదో వారు తెలుసుకోవా లని నేను కోరుకుంటున్నాను, అయితే ప్రతి ఒక్కరూ ప్రేమతో, ఆశతో , క్షమాపణతో జీవించడం నేర్చుకోగ లిగితే ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది అంటుందామె. చాలా కాలం నుంచి ఆమె అనుభ‌విస్తున్న మాన‌సిక వ్య‌ధ‌తో పాటు శారీర‌క గాయాల‌నుంచి కూడా ఇటీవ‌లే  తేరుకున్నారు. 

వియ‌త్నాంయుద్ధ స‌మ‌యంలో దారుణ ప‌రిస్థితుల మ‌ధ్య ప్రాణం అర‌చేతిలో ప‌ట్టి బిక్కుబిక్కుమంటూ ప్ర‌తీ క్ష‌ణం గ‌డిపారు ఫాన్ థీ. 1972 జూన్ 8న కేవ‌లం తొమ్మిదేళ్ల పిల్ల‌.  సాయ్‌గాన్ కి కొంత దూరంలోని త్రాంగ్ బాంగ్‌లోని కావో దాయ్ గుడి ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటోంది. ప‌క్క‌నే త‌నతో పాటు మూడేళ్ల చిన్నారి కూడా వుంది. ఇద్ద‌రూ చ‌క్క‌గా న‌వ్వుకుంటూ ఆడుకుంటున్నారు. హ‌ఠాత్తుగా పిల్ల‌లూ పారిపోండి.. అంటూ కొంద‌రు సైనికులు అరుస్తూ ఆ గుడి ప్రాంగ‌ణంలోకి ప‌రుగులు తీశారు. నెత్తి మీంచి రివ్వున అప్పుడే ఒక విమానం వెళ్ల‌డం భ‌య‌పెట్టిందిట‌. అంత‌లో ఠ‌క్కున త‌లెత్తి చూసేలోగానే నాలుగు బాంబులు ప‌డ్డాయి. అంతే క్ష‌ణాల్లో వారి చుట్టూ పెద్ద మంట‌లు ఆకాశాన్నంటాయి. ఆ మంట‌ల్లో ఒక్క‌సారిగా ఏదో వ‌చ్చి ఆమె ను  గ‌ట్టిగా కొట్టింది.  మెడ‌, ఎడ‌మ‌చేతికి గాయాల‌య్యాయి. కాలిన‌చోట చొక్కా చించేలోగానే కుడి చేయి కొంత భాగం కాలింది. అయినా బ‌తికింది. ఇపుడు త‌ల్చుకుని ఎలా బ‌తికానా అని ఆశ్చ‌ర్య‌పోతోంది. అస‌లా రోజు ఆ సంఘ‌ట‌న‌ను తోటివారికి 59 ఏళ్ల ఫాన్ థీ వివ‌రిస్తుంటే ఒళ్లు భ‌యంతో జ‌ల‌ద‌రించింది. 

ఆమె త‌న బంధువుల పిల్ల‌తో బ‌తుకుజీవుడా అని ప‌రిగెడుతూంటే వియ‌త్నాం ఫోటోగ్రాఫ‌ర్ చూసి ఫోటో తీసేడు. వారికి సైనికులు మంచినీళ్లు ఇచ్చారు. కాలిన గాయాల‌ను నీళ్ల‌తో క‌డిగారు. అప్ప‌టికే చేయి బాగా కాలిపోయిందిట‌. ఆ గాయాల్ని చూసిన మరుక్ష‌ణం ఆమె స్పృహ కోల్పోయింది. ఆ ఫోటోగ్రాఫ‌ర్ ప‌రుగున ఆ పిల్ల‌ల‌ను ఇద్ద‌రినీ సైగాన్ ఆస్పత్రికి త‌ర‌లించాడు. ఆమె శ‌రీరం  65 శాతం కాలిపోయింది. న‌రాలు దెబ్బ తిన్నాయి. ఆ త‌ర్వాత అమెరికా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ  ఆమె  14 నెల‌ల‌పాటు  చికిత్స చేయిం చుకుంది. ఆ స‌మ‌యంలో ఆమెను మామూలు మ‌నిషిని చేయ‌డానికి ఏకంగా 16 స‌ర్జ‌రీలు చేశార‌ట‌!

ఉత్ అనే ఆ వియ‌త్నాం ఫోటోగ్రాఫ‌ర్ తీసిన చిత్రాల వ‌ల్ల అమెరికాలో క‌ల్లోలం చెల‌రేగింది. ద‌క్షిణ వియ త్నామీయులు పొర‌పాటున వారి గ్రామాల మీద‌నే బాంబులు వేశారు. పిల్ల‌లు, పెద్ద‌లు ప్రాణ‌భీతితో రోడ్ల వెంట ప‌రుగులు తీశారు. ఈయుద్ధ కాల‌మంతా ముగిసిన త‌ర్వాత ఆ ఫోటోగ్రాఫ‌ర్‌కి ఉత్త‌మ ఫోటోగ్రాఫ‌ర్‌గా గుర్తింపు ల‌భించింది, పులిట్జ‌ర్ బ‌హుమ‌తి అందుకున్నాడు. కానీ అత‌నికి ఈ వియ‌త్నాం పిల్ల జీవితాంతం గుర్తుంటుంది. ప్ర‌స్తుతం 59 ఏళ్ల ఫాన్ థీకి ఆ సంఘ‌ట‌న‌, ఆ  దారుణ ప‌రిస్థితులు ఇప్ప‌టికీ, ఇంకెప్ప‌టికీ అద్దంలో క‌నిపించినంత స్ప‌ష్టంగా గుర్తుండిపోతాయి.  లోక‌మంతా ఆమెను బ్రేవ్ గ‌ర్ల్ అన్న‌ది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...