Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్వామి సేవలో మంత్రి రజినీ..
posted on: Apr 25, 2022 4:39PM
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్లలోనే మంత్రి పదవి కొట్టేశారు. కీలకశాఖ సైతం వరించింది. ఇదేమన్నా మామూలు విషయమా. అంతా దైవ సంకల్పం.. స్వామి దయ.. అనుకున్నారో ఏమో.. విశాఖ శారదాపీఠం దర్శించి.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు మంత్రి విడదల రజినీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజినీకి.. విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు కూడా అప్పగించారు జగన్. ఇటు ప్రభుత్వ పదవి, అటు పార్టీ పదవి.. ఈ కొత్త కొత్త పదవులు చూసి కొత్త ఎమ్మెల్యే తెగ ఖుషీ ఖుషీగా ఉన్నారు. అంతా దైవ కృపగా భావిస్తున్నారు.
అందుకే, విశాఖకు వచ్చిన విడదల రజినీ.. శారదాపీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానంద స్వామికి పాదాభివందనం చేసి.. ఆశీస్సులు తీసుకున్నారు.
రజినీ అనే కాదు.. విశాఖకు వచ్చే వైసీపీ నేతలు చాలామంది స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఇలా, జగన్ భక్తులంతా.. స్వరూపానంద భక్తులు కావడం వెనుక కారణం ఏంటో తెలుసుగా..!!





.webp)


