Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వేప గురించి 15 విషయాలు
posted on: Apr 4, 2019 11:58AM

తెలుగువారి ఉగాది వచ్చిందంటే... వేపపువ్వుతో చేసిన పచ్చడి తినందే ఆ పండుగ అసంపూర్ణమే! ఉగాది సందర్భంలో వచ్చే వేపపూలని తినేందుకు ప్రోత్సహించడమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ వేపపచ్చడి ఎండాకాలంలో రాబోయే అంటురోగాలను శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే వేపతో మన అనుబంధం కేవలం ఉగాదితో తీరిపోయేది కాదు. వేపకి ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి!
- వేపని మనం చెట్టుగా కాకుండా దేవతగా భావిస్తూ ఉంటాము. ఆ దేవత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాము. అందుకే ఉగాది వంటి సందర్భాలలోనే కాకుండా గ్రామదేవతల జాతర్లలో కూడా వేపమండలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు.
- వేపచెట్టు నుంచి వీచేగాలి, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే అవధూతలు సైతం వేపచెట్లు ఉండే ప్రాంతంలో తిరిగేందుకు ఇష్టపడతారట. వేపచెట్టు కింద నిద్రించేవారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆయుర్వేదం చెబుతోంది.
- వేప ఆకు, పూలు, బెరడు, కాయలు... ఇలా వేపచెట్టులోని అణువణువూ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చరకసంహిత వేపను సర్వరోగనివారిణిగా పేర్కొంటోంది. వేపతో నింబాదితైలం లాంటి అనేక లైపనాలు, తైలాలు, చూర్ణాలను తయారుచేస్తారు.
- రోజూ క్రమం తప్పకుండా వేపచిగుళ్లని తింటూ ఉంటే షుగర్ వ్యాధి దరిచేరదు.
- వేపచిగుళ్లని తినడం వల్ల పేగులలో ఉన్న హానికారక సూక్ష్మజీవులు, నులి పురుగులు కూడా చచ్చిపోతాయి.
- వేపపుళ్లలతో పళ్లు తోముకుంటే పళ్లు, చిగుళ్లు దృఢంగా ఉండటమే కాకుండా... పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వెంట రక్తం కారడం వంటి సమస్యలు కూడా దరిచేరవు.
- వేపలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకనే చర్మానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేపాకులను కాచిన నీటితో కానీ వేపనూనెతో తయారుచేసిన సబ్బులని కానీ రుద్దుకుంటే చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి, శరీరం దుర్గంధాన్ని నివారిస్తుంది.
- వేపలో యాంటీవైరల్ సుగుణాలు ఉన్నాయి. అందుకే పొంగు, మశూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు... రోగులను వేపమండల మీద పడుకోపెట్టేవారు.
- వేపాకుల గుజ్జుని కనుక తలకి పట్టిస్తే చుండ్రు, పేలులాంటి జుట్టుకి సంబంధించిన సమస్యలు మాయమైపోతాయి.
- వైద్యుడి సూచనల ప్రకారం వేప చూర్ణాన్ని తీసుకుంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- నేతిలో కాచిన వేపాకుని కానీ వేప పండ్లు లేదా ఆకుల గుజ్జుని కానీ మొటిమలు, పుండ్లు మీద రాస్తే ఒకటి రెండు రోజులలోనే ఫలితం కనిపిస్తుంది.
- వేప పండ్లు, విత్తనాల నుంచి తీసిన నూనె అద్భుతమైన క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. ఒకరకంగా ప్రకృతి సిద్ధమైన pesticide, insecticideలలో వేపదే ప్రథమ స్థానం.
- వేప పూతని ఉగాది పచ్చడిలో వాడటం మనకి తెలిసిందే. దీనిని నింబకుసుమభక్షణం అంటారు. వేపపువ్వు, వేపకాయలు, లేత వేప చిగుళ్లని ఉపయోగించి వంట చేయడం కూడా కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది.
- ఇంటికి కలపగా వాడటంలో టేకు, మద్ది తరువాత వేపకే ప్రాధాన్యత. పైగా వేపతో చేసిన కలప ఎన్నాళ్లయినా పుచ్చిపోకుండా, చెదలు సోకకుండా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.
- ఇంతటి ఘనత కలిగిన వేప మన భారత ఉపఖండంలోనే ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు తేల్చారు!
- నిర్జర.






