Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు...
posted on: Jan 28, 2017 1:44PM
.jpg)
ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం తీరును, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై కూడా పలు విమర్శలు చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ పై పెట్టిన శ్రద్ద ఏపీ సమస్యలపై పెట్టి ఉంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదని..మీరు మూడు సంవత్సరాల్లో ఇన్ని రకాలుగా మాటలు మార్చారు. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు. ఏదైనా చేయించుకోండి. కానీ నమ్మకాన్ని నిలుపుకోండి" అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు స్పందించినట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఉత్తరాది పెత్తనం అంటూ అనవసర వ్యాఖ్యలు చేశారని.. నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిందని పవన్ పేరు ఎత్తకుండా పరోక్షంగా హితవు పలికారు. మరి దీనిపై పవన్ మళ్లీ ఎలా స్పందిస్తారో చూద్దాం..



.jpg)


